స్టార్ హీరో సూర్య షూటింగ్ లో గాయపడ్డాని తమిళ మీడియా వెల్లడించింది.ప్రస్తుతం పేట ఫేమ్ కార్తిక్ సుబ్బరాజ్ తో సూర్య తన 44వ సినిమాను చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ ఊటీ లో జరుగుతుంది.అందులో భాగంగా యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్న సమయంలో సూర్య తలకు చిన్న దెబ్బ తగిలిందని దాంతో కొన్ని రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారట.త్వరలోనే మళ్లీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలకానుంది.
ఇక సూర్య నటించిన కంగువా రిలీజ్ కు రెడీ అవుతుంది.ఈసినిమాపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.శివ డైరెక్షన్ లో భారీ విఎఫ్ఎక్స్ తో వస్తుంది ఈసినిమా.ఇందులో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.స్టూడియో గ్రీన్,యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి.ఈఅక్టోబర్ 10న థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: