అక్షయ్ తో సూర్య ‘సూరరై పోట్రు’ రీమేక్

Suriya To Remake Soorarai Pottru In Hindi With Akshay Kumar,Suriya Joins Hands With Akshay Kumar For Soorarai Pottru Remake in Hindi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Suriya,Hero Suriya,Suriya Upcoming Movies,Suriya Latest movie Updates,Suriya Upcoming Movie,Suriya New Movie Updates,Suriya Upcoming Projects,Suriya With Akshay Kumar, Akshya Kumar Soorarai Pottru,Suriya join Hands with Akshya Kumar Remake Movie,Suriya Joins Hands With Akshay Kumar For Soorarai Pottur,Suriya Joins Hands With Akshay Kumar For Soorarai Pottru Remake in Hindi,

ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. తెలుగు, తమిళ్, కన్నడ మలయాళం సినిమాలు ఇండియన్ మార్కెట్ పై పెద్ద ఎఫెక్ట్ నే చూపిస్తున్నాయి. దీంతో సౌత్ సినిమాలకు నార్త్ లో కూడా మండి డిమాండ్ పెరిగింది. వరుసపెట్టి సౌత్ సినిమాలను నార్త్ లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు నార్త్ లో రీమేక్ అవ్వగా ఇప్పుడు మరో సౌత్ సినిమా కూడా రీమేక్ కు సిద్దమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా తమిళ్ లో ‘సూరరై పోట్రు’. తెలుగులో ఈసినిమాను ఆకాశమే నీ హద్దురా..! అనే టైటిల్ తో తెరకెక్కించారు. ఓటీటీలో రిలీజ్ అయిన ఈసినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు నేషనల్ అవార్డును సైతం అందుకుంది. ఇప్పుడు ఈసినిమాను రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా సూర్య ఈసినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఇక ఈసినిమా షూటింగ్ ను నేడు ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు. అంతేకాదు ఈసినిమాకు ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.. మీకు ఏదైనా టైటిల్ ఉంటే చెప్పండి అంటూ అక్షయ్ తన ట్విట్టర్ వేదికగా కోరాడు. మరి ఫ్యాన్స్ ఏమైనా టైటిల్స్ ను ఇస్తారేమో చూద్దాం. కాగా ఆయనకు జోడీగా రాధిక మదన్ నటిస్తోంది. హిందీ లో కూడా ఈ సినిమా ఒరిజినల్ డైరెక్టర్ సుధా కొంగరనే దర్శకత్వం వహిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + sixteen =