
ట్యాగ్ · 192 కథనాలు


నాయక్ రీ రిలీజ్ కానుంది

గేమ్ ఛేంజర్ రాంపేజ్ షురూ

గొప్ప మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్

ఫాదర్స్ డే .. క్లీంకారతో రామ్ చరణ్, పిక్ వైరల్

డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్ చరణ్

ఆర్ సి 17 అప్డేట్ వచ్చేసింది

చరణ్ బర్త్ డే ట్రీట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

హాలీవుడ్ లో చరణ్ క్రేజ్

స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న చరణ్

అయోధ్య వేడుకకు.. రామ్ చరణ్, ఉపాసనలకు ఆహ్వానం

రామ్ చరణ్ vs సూర్య ఇంట్రెస్టింగ్ ఫైట్

RC 16 లాంగ్ షెడ్యూల్ కంప్లీట్
గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.చాలా రోజుల నుండి ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లోని బూత్ బంగ్లాలో జరుగుతూ రాగా నిన్నటి తో కంప్లీట్ అయ్యింది.ఈ షెడ్యూల్ లో క్రికెట్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను అలాగే మరికొన్ని కీలక సీన్లను చిత్రీకరించారు.

నాయక్ రీ రిలీజ్ కానుంది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,డైరెక్టర్ వి వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నాయక్.2013 లో విడుదలైన ఈసినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇందులో చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించగా కాజల్ ,అమలా పాల్ హీరోయిన్లుగా నటించారు. చరణ్ నటన, డ్యాన్స్ కు తోడు , బ్రహ్మానందం , పోసాని కృష్ణ మురళి ల కామెడీ ,సాంగ్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.

గేమ్ ఛేంజర్ రాంపేజ్ షురూ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈసినిమాకు ఆల్ ఓవర్ పాజిటివ్ టాక్ వస్తుంది.ముఖ్యంగా రామ్ చరణ్ నటన ,తమన్ సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.ఇండియన్ 2 తరువాత గేమ్ ఛేంజర్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ కంబ్యాక్ ఇచ్చాడు.ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే సెకండ్ హాఫ్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ నటన అద్భుతం అని చెప్పొచ్చు.ఓవరాల్ గా ఓ మంచి పొలిటికల్ ఎంటర్టైనర్ ను అందించాడు శంకర్.

గ్లోబల్ రేంజ్‌కి రామ్ చరణ్ క్రేజ్.. ది రియల్ గేమ్ ఛేంజర్
'ఆర్ఆర్ఆర్' మూవీతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీని తరువాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

గొప్ప మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
నటనలోనే కాదు.. మనసులోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. హార్ట్ ఇష్యూ (పల్మనరీ హైపర్‌టెన్షన్) జన్మించిన, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పాప పాలిట ప్రాణదాతగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న ఒక ఫోటో జర్నలిస్ట్ కుటుంబంలో ఒక చిన్నారి జన్మించింది. అయితే ఆ పాప గుండెల్లో ఏదో సమస్య ఉందని వైద్యులు గుర్తించారు.

గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన టీం
రామ్ చరణ్ ,శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.అయితే ఈ రిలీజ్ ఎప్పుడు కానుందో ఇంతకుముందే ఓ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు చెప్పేశారు.క్రిస్మస్ కు వస్తుందని ఆయన అన్నారు.కానీ గత కొన్ని రోజులనుండి ఆ సమయానికి రావడం డౌటే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయ్యింది.దాంతో ఇక ఇప్పుడు మరోసారి గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి టీం క్లారిటీ ఇచ్చింది.ఈరోజు ఈసినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి.

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్
'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఫాదర్స్ డే .. క్లీంకారతో రామ్ చరణ్, పిక్ వైరల్
ఫాదర్స్ డే సందర్భంగా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన గారాల పట్టి క్లీంకారతో కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముద్దుల తనయ క్లీంకారను ఎత్తుకుని గాల్లోకి ఎగరేస్తూ ఆడిస్తున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. కాగా రామ్ చరణ్, క్లీంకార ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వివరీతంగా షేర్స్ చేస్తూ లైక్స్ కొడుతూ తమ పేవరెట్ హీరోపై ఓ రేంజ్‌లో అభిమానం చూపిస్తున్నారు.

రోజు రోజుకీ మా నాన్న వయస్సు తగ్గుతోంది - రామ్ చరణ్
రోజు రోజుకీ మా నాన్న వయస్సు తగ్గుతోందని, ఆయన ఇంకా యంగ్‌గా మారుతున్నారని పేర్కొన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ మేరకు ఆయన తాజాగా ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఆయనతో తనకున్న అనుబంధం గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవికి తనయుడిగా జన్మించడం తన అదృష్టమన్న ఆయన చిత్ర పరిశ్రమలో తండ్రి వారసత్వాన్ని కొనసాగించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పారు.

డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆతర్వాత కూడా వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుచుకుంటూ స్టార్ హీరో అయ్యాడు. ఇక రంగస్థలంతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఆసినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ ఏకంగా గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ స్థాయిలో రామ్ చరణ్ క్రేజ్ పెరిగింది. అంతేకాదు ఇక్కడ మాత్రమే కాదు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను సైతం అందుకున్నాడు.

ఆర్ సి 17 అప్డేట్ వచ్చేసింది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించనున్న 17వ సినిమా గురించి అఫిషియల్ గా అప్డేట్ వచ్చింది.గత కొన్ని రోజులు గా ఈసినిమాను సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈకాంబినేషన్ ఫిక్స్ అయ్యింది.రామ్ చరణ్ 17వ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయనున్నాడు.ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.ఇంతకుముందు ఇదే కాంబినేషన్ లో ఇంతకుముందు రంగస్థలం వచ్చింది.ఈసినిమా హ్యుజ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.

చరణ్ బర్త్ డే ట్రీట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఇంకా బుచ్చిబాబు తో తన 16వ సినిమా చేయబోతున్నాడను. రీసెంట్ గానే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు.

మా కాంబినేషన్ ఈ సినిమాతో నిజం కాబోతుంది - రామ్ చరణ్
'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RC 16 బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో రామ్ చరణ్ జతగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సినిమా తెరకెక్కుతుంది.

ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్.. నెట్టింట వీడియో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోలు, 'ఆర్ఆర్ఆర్' కో స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లు ఒకేచోట కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు వీరు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో కలిసి కనిపించారు. వీరిద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్‌లో కలుసుకోగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకై బేగంపేట విమానాశ్రయం వద్దకు వచ్చారు. గుజరాత్ లోని జామ్ నగర్‌లో అనంత్ అంబానీ వివాహం జరుగనున్న సంగతి తెలిసిందే.

హాలీవుడ్ లో చరణ్ క్రేజ్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ కు హాలీవుడ్ లో కూడా క్రేజ్ బాగానే పెరిగిందన్న సంగతి తెలిసిందే. అక్కడ అవార్డులను సైతం దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి చరణ్ క్రేజ్ అక్కడ ఎలా ఉంది రుజువైంది. తాజాగా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ప్రకటన ఇచ్చారు మేకర్స. ఓ ప్రముఖ కాస్టింగ్ సైట్ ఒక పాత్ర కోసం నటుడు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. ఇక ఆ పాత్ర ఎలా ఉండాలో తెలియజేయడం కోసం కొన్ని పాత్రలను ఉదాహరణగా చూపించింది. అలా ఒక ఆరు పాత్రలని ఆ ప్రకటనలో ఇచ్చారు. ఆ పాత్రల్లో ఒకటి.. ఆర్ఆర్ఆర్ లోని రామ్ చరణ్ కాప్ రోల్. వాటిలో ఉన్న మిగిలిన ఐదు పాత్రలు హాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకానిక్ గా నిలిచినవే. మరి అంతమంది హాలీవుడ్ నటుల మధ్య…

స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న చరణ్
సినిమా సినిమాకు హీరోలు తమ మేకోవర్ ను మార్చుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి వారిని మెప్పించడానికి అయినా హీరోలు లుక్స్ ను ఛేంజ్ చేయాల్సిందే. ఇక హీరో రామ్ చరణ్ కూడా ఎప్పుడూ కొత్త లుక్స్ ను ట్రై చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా చరణ్ కు సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యాడ్ కోసం చరణ్ చాలా స్టైలిష్ గా రెడీ అయ్యాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ తో చేసిన తన కొత్త హెయిర్ స్టైల్ లుక్ లో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోలను అలీమ్ హకీమ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈఫొటోలు వైరల్ అవుతున్నాయి.

చరణ్ పై శర్వా ప్రశంసలు-నాకు స్నేహితుడు కావడం గర్వకారణం
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో పేరు సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో…

అయోధ్య వేడుకకు.. రామ్ చరణ్, ఉపాసనలకు ఆహ్వానం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ప్రత్యేక ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి మొత్తం 8వేల మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ దంపతులకు రామ్ మందిర్ క్షేత్ర తీర్థ్ ట్రస్ట్ ఆహ్వానం పలికింది. ఈ మేరకు ట్రస్ట్ ప్రతినిధి నేడు చరణ్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

RC16 కోసం ఏ.ఆర్ రెహమాన్.. చరణ్ స్పెషల్ బర్త్ డే విషెస్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

రామ్ చరణ్ vs సూర్య ఇంట్రెస్టింగ్ ఫైట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మధ్య త్వరలో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగనుంది. అయితే ఇది సినిమాల పరంగా కాదు.. క్రికెట్ పరంగా. అవును మీరు విన్నది నిజమే. ఇటీవలే రామ్ చరణ్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్)లో హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసి క్రీడా రంగంలోకి ఎంటరైన సంగతి తెలిసిందే. సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికి, ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ప్రోత్సహించడానికి, గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ వెంచర్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా చరణ్ పేర్కొన్నాడు.