గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్

Ram Charan's Game Changer Wraps up The Shoot

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో  గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా హీరోయిన్‌గా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలాఉంటే.. ఈ మూవీ నుంచి అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ చరణ్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌ చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. సోషల్ మెసేజ్‍తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్‌, ‘రోబో’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన ఎస్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇక గేమ్‌చేంజర్‌ తరువాత రామ్ చరణ్, బుచ్చిబాబుతో సినిమాపై దృష్టిసారించనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మైత్రి మూవీస్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.