ఫాదర్స్ డే .. క్లీంకారతో రామ్ చ‌ర‌ణ్, పిక్ వైరల్

Father's Day: Ram Charan Special Moment with Klin Kaara, Pic Goes Viral

ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా.. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న గారాల పట్టి క్లీంకారతో కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముద్దుల తనయ క్లీంకారను ఎత్తుకుని గాల్లోకి ఎగరేస్తూ ఆడిస్తున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. కాగా రామ్ చ‌ర‌ణ్, క్లీంకార ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. దీనిని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వివరీతంగా షేర్స్ చేస్తూ లైక్స్ కొడుతూ తమ పేవరెట్ హీరోపై ఓ రేంజ్‌లో అభిమానం చూపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఫాదర్స్‌ డే సందర్భంగా ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తండ్రిగా తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. క్లీంకార రాకతో తమ ఇల్లు ఆనందాలవనంగా మారింది. రోజులన్నీ క్షణాల్లా గడిచిపోతున్నాయి, పాప పుట్టి అప్పుడే ఏడాది కావస్తోంది. నేను, ఉపాసన తల్లిదండ్రులుగా పుత్రికోత్సాహం అనుభవిస్తున్నాం. ముఖ్యంగా క్లీంకార, ఉపాసనల అనుబంధం చూస్తుంటే ముచ్చటేస్తుంది. పాపే లోకంగా బ్రతుకుతోంది ఉపాసన. అలా ఉండగలగడం ఈ లోకంలో కేవలం తల్లికి మాత్రమే సాధ్యం” అని అన్నారు.

ఇంకా చరణ్ మాట్లాడుతూ.. “ఇప్పుడిప్పుడే క్లీంకార చుట్టూ ఉండేవారిని గుర్తుపడుతోంది. తనకు రోజూ అన్నం తినిపించేది నేనే. ఇలా రోజుకు రెండుసార్లు తనకి అన్నం తినిపిస్తాను. నేను పెడితే గిన్నె ఖాళీ అయిపోవాల్సిందే. ఆ సమయంలో నాలో సూపర్‌పవర్స్‌ ఆవహిస్తాయి. అయితే షూటింగ్స్‌ వలన తనని చాలా మిస్‌ అవుతున్నాను. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నా. క్లీంకార స్కూల్‌లో జాయిన్‌ అయ్యేవరకైనా తనతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నా. దానికి తగ్గట్లుగా నా సినిమాల షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేసుకోబోతున్నా” అని తెలిపారు స్టార్ హీరో రామ్ చరణ్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.