రామ్ చరణ్ ,శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.అయితే ఈ రిలీజ్ ఎప్పుడు కానుందో ఇంతకుముందే ఓ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు చెప్పేశారు.క్రిస్మస్ కు వస్తుందని ఆయన అన్నారు.కానీ గత కొన్ని రోజులనుండి ఆ సమయానికి రావడం డౌటే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయ్యింది.దాంతో ఇక ఇప్పుడు మరోసారి గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి టీం క్లారిటీ ఇచ్చింది.ఈరోజు ఈసినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా అందుకు సంబధించిన పిక్స్ ను రిలీజ్ చేస్తూ క్రిస్మస్ కు వస్తున్నామని తెలిపారు.సో అన్ని కుదిరితే డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రావడం పక్కా.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.శంకర్ మార్క్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ ,అంజలి,ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటి వరకు అయితే ఈసినిమా నుండి ఒకే ఒక్క సాంగ్ బయటికి వచ్చింది.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశాడు.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది.ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీస్,వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నాయి.సెప్టెంబర్ లేదా అక్టోబర్ లేదా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: