గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,డైరెక్టర్ వి వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నాయక్.2013 లో విడుదలైన ఈసినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇందులో చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించగా కాజల్ ,అమలా పాల్ హీరోయిన్లుగా నటించారు. చరణ్ నటన, డ్యాన్స్ కు తోడు , బ్రహ్మానందం , పోసాని కృష్ణ మురళి ల కామెడీ ,సాంగ్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది.ఈనెల 27న చరణ్ బర్త్ డే సందర్భంగా మళ్ళీ థియేటర్లలోకి రానుంది.అయితే ఆ తరువాతి రోజు రాబిన్ హుడ్ ,మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ కానున్నాయి.ఈ రెండు సినిమాలకు సూపర్ బజ్ వుంది.ఈ తరుణంలో ఒక్క రోజు ముందుగా వస్తున్న నాయక్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.థమన్ ఈసినిమాకు సంగీతం అందించగా డివివి దానయ్య నిర్మించారు.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్ట్ చేస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ ,మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.ఈఏడాది చివర్లో విడుదలచేయాలని చూస్తున్నారు.చరణ్ బర్త్ డే కానుకగా ఈనెల 27న ఈసినిమానుండి అప్డేట్ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: