గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.చాలా రోజుల నుండి ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లోని బూత్ బంగ్లాలో జరుగుతూ రాగా నిన్నటి తో కంప్లీట్ అయ్యింది.ఈ షెడ్యూల్ లో క్రికెట్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను అలాగే మరికొన్ని కీలక సీన్లను చిత్రీకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నెక్స్ట్ షెడ్యూల్ కూడా తొందరగానే స్టార్ట్ కానుంది.ఆగస్టు లోపు సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.కుదిరితే ఈఏడాది చివర్లో ఈసినిమా థియేటర్లలోకి తీసుకురానున్నారు.ఇక ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమానుండి అప్డేట్ ఇవ్వనున్నారు.రామ్ చరణ్ ఫస్ట్ లుక్ తోపాటు తన పాత్రను పరిచయం చేసే గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే గ్లింప్స్ కు సంబంధించిన వర్క్ ఇంకా పూర్తికాలేదు.దాంతో ఫస్ట్ లుక్ ఒకటే వదిలి టైటిల్ చెప్తారో లేక గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేస్తారో చూడాలి.
రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించనుండగా ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.
ఇక ఈసినిమాను పూర్తి చేసి రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాను సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: