రోజు రోజుకీ మా నాన్న వయస్సు తగ్గుతోంది – రామ్ చరణ్

Ram Charan Says, I Think My Dad is Reverse Ageing

రోజు రోజుకీ మా నాన్న వయస్సు తగ్గుతోందని, ఆయన ఇంకా యంగ్‌గా మారుతున్నారని పేర్కొన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ మేరకు ఆయన తాజాగా ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఆయనతో తనకున్న అనుబంధం గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవికి తనయుడిగా జన్మించడం తన అదృష్టమన్న ఆయన చిత్ర పరిశ్రమలో తండ్రి వారసత్వాన్ని కొనసాగించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా చరణ్ మాట్లాడుతూ.. తండ్రి చిరంజీవే తనకు ఇన్స్పిరేషన్ అని, గొప్ప రోల్ మోడల్ అని పేర్కొన్నారు. సినిమాలు విజయం సాధించినా, అపజయం పాలైనా మన ప్రయత్నలోపం మాత్రం ఉండకూడదని ఆయన ఎల్లప్పుడూ చెప్తుంటారని, ఇప్పటికీ తాను అదే ఫాలో అవుతున్నానని తెలిపారు. ఇక వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా చిరంజీవి తనకు ఆదర్శమని చెప్పారు. తనతోపాటు కుటుంబసభ్యులు అందరికీ తండ్రి అండగా ఉంటారని, వారి భావాలకు విలువ ఇస్తారని వివరించారు.

ఇక తన తండ్రికి ఇటీవలే భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును బహూకరించిన విషయంపై స్పందించిన చరణ్ ఆ పురస్కారానికి తన తండ్రికి పూర్తి అర్హత ఉందని తాను భావిస్తున్నాని పేర్కొన్నారు. చిత్రపరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎనలేనివాని, కేవలం సినిమాలే కాకుండా సమాజసేవలోనూ చిరంజీవి అనేకమందికి ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని చెప్పే తన తండ్రి అది కేవలం మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారని తెలిపారు. ఇప్పటికీ ఉదయాన్నే ఐదింటికే నిద్ర లేస్తారని, క్రమం తప్పకుండా జిమ్ చేస్తుంటారని, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని తండ్రి చిరంజీవి గురించి వివరించారు హీరో రామ్ చరణ్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.