గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈసినిమాకు ఆల్ ఓవర్ పాజిటివ్ టాక్ వస్తుంది.ముఖ్యంగా రామ్ చరణ్ నటన ,తమన్ సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.ఇండియన్ 2 తరువాత గేమ్ ఛేంజర్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ కంబ్యాక్ ఇచ్చాడు.ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే సెకండ్ హాఫ్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ నటన అద్భుతం అని చెప్పొచ్చు.ఓవరాల్ గా ఓ మంచి పొలిటికల్ ఎంటర్టైనర్ ను అందించాడు శంకర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజు దాదాపు అన్ని షోస్ ఫుల్ అయ్యాయి.హిందీ ,తమిళంలో బుకింగ్స్ బాగున్నాయి..ఓవర్సీస్ లో కూడా సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయి.ట్రెండ్ చూస్తుంటే మొదటి రోజు గేమ్ ఛేంజర్ 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకోనుంది.అదే జరిగితే చరణ్ కెరీర్ లో ఇది రెండో 100 కోట్ల ఓపెనింగ్ సినిమా కానుంది. ఇంతకుముందు ఆర్ఆర్ఆర్ తో ఈ ఫీట్ సాధించాడు.సోలో హీరోగా మాత్రం ఇదే మొదటిది కానుంది.
టికెట్ హైక్ ,ఎక్స్ట్రా షోస్ సినిమాకు అడ్వాంటేజ్ అయ్యాయి.ఎలాగు పండగ సీజన్ కాబట్టి కలెక్షన్ల పరంగా ఎలాంటి డోకా ఉండదు.అయితే వచ్చే నాలుగు రోజుల వ్యవధిలో మరో రెండు సినిమాలు బరిలోకి దిగనున్నాయి.అందులో బాలకృష్ణ డాకు మహారాజ్ ,వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కానున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ కు పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: