కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Radhe Shyam

ట్యాగ్ · 177 కథనాలు · పేజీ 9

షూటింగ్ అప్‌డేట్

ఇటలీ మీడియా లో ప్రభాస్

బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2 "మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దేశ , విదేశాలలో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. రష్యా , చైనా , జపాన్ వంటి దేశాలలో హీరో ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిన ప్రభాస్ మూవీస్ కై అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్నారు. "రాధేశ్యామ్ "మూవీ తరువాత రెండు భారీ చిత్రాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Radhe Shyam Movie Team Releases Prabhas First Look Movie Poster A Head Of His Birthday
ఫస్ట్ లుక్

'రాధే శ్యామ్' - 'విక్రమాధిత్యగా' గా ప్రభాస్

సోషల్ మీడియా లో ప్రభాస్ సందడి మొదలైపోయింది. పుట్టిన రోజుకు మరో రెండు రోజులు ఉండగానే అప్పుడే ప్రభాస్ కు సంబంధించిన సర్ ప్రయిజ్ లు ఇస్తూ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నారు. ఇక ఈ రోజు రాధే శ్యామ్ నుండి సర్ ప్రయిజ్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నాడని తెలుపుతూ ఆ సినిమా యూనిట్ ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. కారు ముందు భాగంపై కూర్చొని కిందికి చూస్తూ ప్రభాస్ నవ్వుతూ కనపడుతున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రాధేశ్యామ్' కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా 'జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్'

బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న "రెబ‌ల్‌స్టార్" ప్ర‌భాస్ త‌న 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ తో బిజీ గా ఉన్నారు చిత్రయూనిట్. ఇటీవలే పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అలానే అక్టోబ‌ర్ 23న‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా "బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్" పేరిట మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆనందంలో పూజాహెగ్డే

దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతుంది. ఇటలీ లో షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ .. చిన్న సెట్ లో తక్కువ టీమ్ మెంబర్స్ తో కరోనా వైరస్ జాగ్రత్తలతో షూటింగ్ జరుగుతుందనీ , కెమెరా ముందు మాస్క్ తీయాలి కాబట్టి తప్పకుండా కొంత రిస్క్ ఉంటుందనీ , లైఫ్ కొనసాగించాలంటే కొత్త జీవన శైలి కి అలవాటుపడాలనీ , తొలి రెండు రోజులు భయమనిపించినా ఇప్పుడు అంతా ఓకే ననీ చెప్పారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'రాధే శ్యామ్' - మోషన్ పోస్టర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

ఒకప్పుడు ప్రభాస్ సినిమా నుండి ఏదైనా అప్ డేట్ రావాలంటే ఎంతో కాలం ఎదురుచూడాల్సి వచ్చేది. ఈ మధ్య ఏంటో అడగక ముందే అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అసలు సంగతేంటంటే ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ టీమ్ ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ప్రేరణ అనే పాత్రలో నటిస్తుంది పూజా.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

రాధేశ్యామ్ నుండి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ రిలీజ్

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధే శ్యామ్. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల ఇన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఇటలీలో షూటింగ్ ను మొదలుపెట్టారు. వీలైనంత తొందరగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసి తిరిగి వచ్చేయాలని ప్లాన్ చేసుకున్నారు టీమ్. అక్టోబర్ నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నారు.

TFN Adminవాట్సాప్
Actress Pooja Hedge Heads To Italy To Join Movie Shoot Of Radhe Shyam
సినిమా వార్తలు

"హలో ఇటలీ "- పూజాహెగ్డే

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి - సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . ఇటలీ , జార్జియాలలో షూటింగ్ జరుపుకున్న "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ కరోనా కారణం గా నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'రాధే శ్యామ్' షూట్ కోసం వెయిటింగ్

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేస్‌లో ముందు ఉంది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, మహర్షి, అరవింద సమేత ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో ఈ బుట్టబొమ్మ జోడీ కట్టేసింది. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఇప్పటికే మొదలైంది. పూజా హెగ్డే, అఖిల్ షూట్ లో పాల్గొంటున్నారు.

TFN Adminవాట్సాప్
Rebel Star Prabhas Is A Highly Committed Person Says Radhe Shyam Director Radhakrishna Kumar
సినిమా వార్తలు

ప్రభాస్ కమిట్ మెంట్ లెవల్స్ పీక్స్

'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. 6.3 మిలియన్ల ట్వీట్స్ తో ఇంతకు ముందున్న ట్విట్టర్ రికార్డులను చెరిపేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ కు బ్రదర్ గా అథర్వా మురళి..?

విభిన్నమైన పాత్రలతో తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అథర్వా మురళి. ఈ మధ్య విడుదలైన వరుణ్‌తేజ్‌ ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంలో కీలక పాత్ర చేసి ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక తమిళ్ సినిమాల్లో చేస్తూనే తెలుగులో కూడా అవకాశాలు కొట్టేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Actress Pooja Hegde Gets Ready For Radhe Shyam Movie Shoot
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ కు రెడీ అయిపోయిన బుట్టబొమ్మ

మొత్తానికి ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలు కూడా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి షూటింగ్ లను ప్రారంభిస్తున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్యాలు అనుమతులు ఇచ్చినా కరోనాకు భయపడి షూటింగ్ లను జరపలేదు. అయితే ఇప్పట్లో కరోనాకు అంతం లేదని భావించి.. తక్కువ మంది స్టాఫ్ తో కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ లను జరపడానికి రెడీ అయిపోతున్నారు. ఒక పది. పదిహేను రోజుల పెండింగ్ వున్న సినిమాలు అయితే ఇప్పటికే షూటింగ్ ను మొదలు పెట్టి మిగిలిన షూట్ ను పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే హీరోయిన్స్ అందరూ చిన్నగా హైదరాబాద్ లో వాలిపోతున్నారు. దీనిలో భాగంగానే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా వచ్చేసింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ఓపికతో ఉండండి.. టీజర్స్, ట్రైలర్స్ అన్నీ వస్తాయి

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు యూరప్ లో షూటింగ్ లు జరుపుకోగా కరోనా వల్ల ఇక్కడకు వచ్చేసారు. మళ్ళీ షూటింగ్ ను సెప్టెంబర్ సెకండ్ వీక్ నుండి మొదలుకానుందని ఇటీవలే తెలియచేసారు. ఇక ఈ సినిమా అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూడగా.. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇదిలా ఉండగా రాధా కృష్ణ తన ట్విట్టర్ ద్వారా అభిమానులను ఈ సినిమా గురించి ముఖ్యమైన ప్రశ్నలు అడగమని చెప్పగా ఇంకా అభిమానులు పలు ప్రశ్నలు అడుగగా వాటిలో కొన్నిటికి రాధా కృష్ణ సమాధానాలు తెలిపారు. ఆ సమాధానాలు ఇవే..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రాధేశ్యామ్' రొమాంటిక్ మూవీ కాదు.. 'అంతకుమించి'..!

ప్రభాస్ సినిమా నుండి అప్ డేట్ వస్తే ఎలా ఉంటుందో అభిమానులు చెప్పకనే చెప్పారు. వర్షం నీటికోసం చకోర పక్షి ఎలా ఎదురుచూస్తుందో.. అలానే ప్రభాస్ కొత్త సినిమా అప్ డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసారు.గతేడాది ఆగస్టులో సాహో వచ్చాక.. అప్పటి నుంచి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ కూడా రాలేదు. ప్రభాస్ ఫస్ట్ లుక్, సినిమా టైటిల్ ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా? అని కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూశారు. ఇక ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి కాస్త ఊరట కలిగించారు. ఇక ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. 6.3 మిలియన్ల ట్వీట్స్ తో…

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"రాధే శ్యామ్ " ఫస్ట్ లుక్ రికార్డ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , తమిళ , హిందీ భాషలలో పీరియాడిక్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ మలయాళ భాషలో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రాధేశ్యామ్ " మూవీ జార్జియా దేశంలోని పలు బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణం గా షూటింగ్ వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'రాధే శ్యామ్' - కొత్త రికార్డ్స్ స్టార్ట్ చేసిన ప్రభాస్..!

ఒక్కోసారి రావడం లేట్ అవ్వోచ్చేమో కానీ.. రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నాడు ప్రభాస్. అలా ఫస్ట్ లుక్, టైటిల్ తో వచ్చాడో లేదో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే పనిలో పడ్డాడు. రాధే శ్యామ్ టైటిల్ ఫిక్స్ చేసిన చిత్ర బృందం, ప్రభాస్ మరియు పూజా హెగ్డేల రొమాంటిక్ లుక్ విడుదల చేయగా ఆ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఫ్యాన్స్ అయితే ఈ 'రాధే శ్యామ్' హ్యాష్ ట్యాగ్ ను ఒక రేంజ్ లో ట్రెండ్ చేశారు. ట్విట్టర్ మొత్తాన్ని 'రాధే శ్యామ్' అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి మోత మోగించారు. దీంతో ఈ ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సింగిల్ హ్యాష్‌ట్యాగ్‌తో 3.8…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"రాధే శ్యామ్ " మూవీ లో ఎయిర్ టెల్ బ్యూటీ ?

"కట్టీ బట్టీ " బాలీవుడ్ మూవీ లో చిన్న పాత్రలో నటించిన సాషా ఎయిర్ టెల్ యాడ్ లో నటించి ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసి జాతీయ స్థాయి లో గుర్తింపు పొందారు. కాన్ఫిడెంట్ తో , స్టైలిష్ గా ఉండే సాషా "ఆపరేషన్ గోల్డ్ ఫిష్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సాషా ఇప్పుడు ప్రభాస్ మూవీ " రాధే శ్యామ్ " కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'ప్రభాస్20' ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్..!

ఎప్పుడైతే ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేస్తున్నామని ప్రభాస్20 టీమ్ చెప్పారో ఆ రోజు నుండే అభిమానులు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు జులై 10.. 10 గంటలు అవుతుందా... ఎప్పుడు ఫస్ట్ లుక్ చూసేద్దామా అనిఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చేసింది. ప్రభాస్ 20 సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఇక ఎప్పటినుండో అనుకున్నట్టే ఈ సినిమాకు 'రాధే శ్యామ్' అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్