రాధేశ్యామ్ నుండి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ రిలీజ్

Actress Pooja Hegde First Look From Radhe Shyam Movie Is Out

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధే శ్యామ్. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల ఇన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఇటలీలో షూటింగ్ ను మొదలుపెట్టారు. వీలైనంత తొందరగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసి తిరిగి వచ్చేయాలని ప్లాన్ చేసుకున్నారు టీమ్. అక్టోబర్ నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా నుండి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో పూజా హెగ్డే ను చూస్తుంటే చిరునవ్వులు చిందిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే ‘ప్రేరణ’ పాత్రలో నటిస్తుంది.

 

కాగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 2 =