‘రాధే శ్యామ్’ – కొత్త రికార్డ్స్ స్టార్ట్ చేసిన ప్రభాస్..!

Prabhas Latest Movie Radhe Shyam First Look Poster Sets New Records On Twitter

ఒక్కోసారి రావడం లేట్ అవ్వోచ్చేమో కానీ.. రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నాడు ప్రభాస్. అలా ఫస్ట్ లుక్, టైటిల్ తో వచ్చాడో లేదో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే పనిలో పడ్డాడు. రాధే శ్యామ్ టైటిల్ ఫిక్స్ చేసిన చిత్ర బృందం, ప్రభాస్ మరియు పూజా హెగ్డేల రొమాంటిక్ లుక్ విడుదల చేయగా ఆ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఫ్యాన్స్ అయితే ఈ ‘రాధే శ్యామ్’ హ్యాష్ ట్యాగ్ ను ఒక రేంజ్ లో ట్రెండ్ చేశారు. ట్విట్టర్ మొత్తాన్ని ‘రాధే శ్యామ్’ అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి మోత మోగించారు. దీంతో ఈ ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సింగిల్ హ్యాష్‌ట్యాగ్‌తో 3.8 మిలియన్లకు పైగా ట్వీట్స్ సాధించిన ఫస్ట్‌లుక్‌గా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రయూనిట్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీనితోపాటు మరో సరికొత్త రికార్డు ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. 24 గంటల్లో 6.3 మిలియన్ ట్వీట్స్ ను దక్కించుకొని కొత్త టార్గెట్ ను ఫిక్స్ చేసింది. మరి ఫస్ట్ లుక్ కే ఇంత ఉంటే.. ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. మరి ఫస్ట్ లుక్ కే ఇంత ఉంటే.. ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

 

‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − five =