
ట్యాగ్ · 17 కథనాలు


గోపీచంద్ భీమా కోసం ఇద్దరు హీరోయిన్లు

ఇండియన్ 2 పదింతలు ఉంటుంది

రుద్రుడు ట్రైలర్ రిలీజ్

కళ్యాణం కమనీయం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ దర్శకులకు కమల్ సూచనలు

ఇండియన్ 2 స్పీడు పెంచనున్న కమల్

ఇండియన్ 2 లో క్రికెటర్ ఫాదర్

రుద్రుడు యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్

సత్యదేవ్ 26 హీరోయిన్ ఫిక్స్

ఇండియన్ 2 మూవీ షూటింగ్ పునః ప్రారంభం

భీమా నుండి మెలోడియస్ ఏదో ఏదో మాయ ఫుల్ సాంగ్ రిలీజ్
ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపీచంద్ కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు గోపీచంద్. ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరో సినిమాతో రాబోతున్నాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది ఈసినిమా. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

భీమా ఫస్ట్ సింగిల్ ఏదో ఏదో మాయ ప్రోమో రిలీజ్
కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడి శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ తేదీన రిలీజ్ కానుంది.

గోపీచంద్ భీమా కోసం ఇద్దరు హీరోయిన్లు
ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై.. ఆతరువాత విలన్ గా కూడా చేసి తన టాలెంట్ చూపించి అందర్నీ మెప్పించి.. ఆ తరువాత యాక్షన్ హీరోగా మారిన నటుడు గోపీచంద్. తన కెరీర్ లో పలు డిఫరెంట్ కథలతో అలరించాడు.. అలరిస్తూనే ఉన్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టేసింది. రీసెంట్ గానే భారీయాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. కాకినాడ పరిసర ప్రాంతాలు అయిన రాజనగరం అద్దరిపేటలో ఈ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.

ఇండియన్ 2 పదింతలు ఉంటుంది
లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జులై వరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే అవకాశాలే ఉన్నాయి.

రుద్రుడు మూవీ లో ఫ్యామిలీ, మాస్, యాక్షన్ అన్నీ ఉన్నాయి
డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్, సపోర్టింగ్ రోల్స్, హీరో ఇలా అని రకాలుగా తన సత్తాను చూపించాడు రాఘవ లారెన్స్. డ్యాన్స్ మాస్టర్ గా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ ఆ తరువాత కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. అంతేకాదు పలు సినిమాలకు దర్శకత్వంలో కూడా వహించాడు. ముఖ్యంగా హార్రర్ సినిమాలతో లారెన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు హీరోగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కతిరేసన్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా వస్తున్న సినిమా రుద్రుడు. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను…

రుద్రుడు ట్రైలర్ రిలీజ్
కదిరేశన్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా రుద్రుడు. ఈసినిమా తమిళ్ లో రుద్రన్ టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో రుద్రుడు అనే టైటిల్ తో వస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ .

సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం రివ్యూ
ఫైనల్ గా చెప్పాలంటే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో తెరకెక్కిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ తో ఆడియన్స్ ను మెప్పిస్తుంది. ఈసినిమాను అన్ని వర్గాల వారు చూసి ఎంజాయ్ చేయొచ్చు.

కళ్యాణం కమనీయం- వెడ్డింగ్ మెలోడియస్ ఓ మనసా సాంగ్ రిలీజ్
టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్ కూడా హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబర్ తో ప్రేక్షకుల ముందుకు రాగా అది మిశ్రమ ఫలితాన్నే అందించింది. ఇక ప్రస్తుతం మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం. ప్రస్తుతం ఈసినిమా షూటంగ్ ను ముగించుకునే పనిలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. పెళ్లి నేపథ్యంలో ఈసినిమా రూపొందించనున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పటికే రిలీజ్…

కళ్యాణం కమనీయం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్ . ఇక ఆతరువాత తను నేను, పేపర్ బాయ్ అంటూ పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల వచ్చిన ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో డీసెంట్ హిట్ లను అందుకున్నాడు. అలానే రీసెంట్ గా లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమా వచ్చింది. ఇక ఈసినిమా హిలోరియస్ ఎంటర్ టైనర్ గా మంటి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సంతోష్ శోభన్

బాలీవుడ్ దర్శకులకు కమల్ సూచనలు
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ హవా దేశవ్యాప్తంగా ఎంత నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకుంటున్నాయి. నార్త్ లో కూడా సౌత్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల మార్కెట్ ఇప్పుడు సాలిడ్ గా ఉంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లు కోసం ఎదురుచూస్తుంది.

రిలీజ్ అయిన కళ్యాణం కమనీయం ఫస్ట్ లుక్
యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ పై అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వంలో సంతోష్ శోభన్ , ప్రియ భవానీ శంకర్ జంటగా తెరకెక్కిన కళ్యాణం కమనీయం మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. కంటెంట్ ప్రధాన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోసంతోష్ శోభన్. తాజాగా మరో డిఫరెంట్ లవ్ స్టోరీతో సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు .ఈ మూవీ తో ప్రియ భవానీ శంకర్ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

నాగచైతన్య ఇన్వెస్టిగేషన్ హైలైట్ గా దూత వెబ్ సిరీస్
పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాగచైతన్య సూపర్ నేచురల్ హారర్ మూవీ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 8ఎపిసోడ్స్ తో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ దూత వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో పార్వతి తిరువోతు , ప్రియ భవానీ శంకర్ , ప్రాచీ దేశాయ్ , దర్శకుడు తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ఇండియన్ 2 స్పీడు పెంచనున్న కమల్
విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్నఇండియన్ 2 సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే మరోపక్క రామ్ చరణ్ సినిమాను అలానే ఇండియన్ 2 సినిమాను పార్లల్ గా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం రామ్ చరణ్ తో ఆర్‌సీ 15 విదేశీ షెడ్యూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే న్యూజిలాండ్ షూట్ ను పూర్తిచేశాడు.

ఇండియన్ 2 లో క్రికెటర్ ఫాదర్
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. ఈసినిమాకు మధ్యలో పలు వివాదాలు తలెత్తినా అనంతరం పలు చర్చలు జరిపి తిరిగి సెట్స్ పైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

రుద్రుడు యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్
ఇండస్ట్రీలోకి డ్యాన్స్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తమిళ్, తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసి ఎన్నో సూపర్ హిట్ లను అందుకున్నాడు రాఘవ లారెన్స్. అలా డ్యాన్స్ మాస్టర్ స్థాయి నుండి పలు సినిమాల్లో కీలక పాత్రలను చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో గా డైరెక్టర్ గా ఇలా అన్నింటిలోనూ తన మార్క్ ను చూపించాడు. దీంతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా లారెన్స్ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తెలుగులో కూడా పలు సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇక ముని సినిమా తరువాత హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సత్యదేవ్ 26 హీరోయిన్ ఫిక్స్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు హీరో అయ్యాడు. ఇక తన సినిమాలతో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాతో మరో స్థాయికి వెళ్లిపోయాడు. నెగెటివ్ షేడ్ లో సత్యదేవ్ చేసిన నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. చిరంజీవి తరువాత ఆ స్థాయిలో నటించింది సత్యదేవే అన్న ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాలపై దృష్టిపెడుతున్నాడు.

ఇండియన్ 2 మూవీ షూటింగ్ పునః ప్రారంభం
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ 1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయం లో కమల్ హాసన్ పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ లో సుకన్య , మనీషా కొయిరాలా కథానాయికలు. ఈ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.