
ట్యాగ్ · 361 కథనాలు


రెట్రో రన్ టైం ఎంతంటే

రెట్రో రిలీజ్ డేట్ లో మార్పు లేదు

కూలీలో పూజా హెగ్డే

రెట్రో తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్

విజయ్ జన నాయగన్ రిలీజ్ వాయిదా

దళపతి 69 షూటింగ్ అప్‌డేట్

దళపతి 69 లాంచ్

గుంటూరు కారం కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్లు

గుంటూరు కారం షూటింగ్ అప్‌డేట్

గుంటూరు కారం యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్

జులై నుండి నాన్ స్టాప్ గా గుంటూరు కారం న్యూ షెడ్యూల్

గుంటూరు కారం- లెంగ్తీ షెడ్యూల్ కోసం ప్లాన్

గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్

SSMB 28 మాస్ స్ట్రైక్ వీడియో రిలీజ్

ఉస్తాద్ భగత్ సింగ్ లో అవే హైలెట్స్

SSMB 28 న్యూ పోస్టర్ రిలీజ్

SSMB28 అప్ డేట్ లోడింగ్

రెట్రో తెలుగు ట్రైలర్ రిలీజ్
కంగువా తరువాత సూర్య రెట్రోతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.వచ్చే నెల 1న తమిళంతోపాటు తెలుగు ,హిందీలోనూ రిలీజ్ అవుతుంది.ఇక నిన్న ఈసినిమా ఆడియో తోపాటు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఇందులో సూర్య డిఫరెంట్ గెటప్ లలో కనిపించాడు.లవ్ ,లాఫ్టర్ , వార్ అనే కాన్సెప్ట్ తో వస్తుంది ఈసినిమా.ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచింది.

రెట్రో రన్ టైం ఎంతంటే
కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ రెట్రోతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.సూర్య ఈసినిమాను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశాడు. ఇందులో తను గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.రేపు ఈసినిమా ఆడియో తోపాటు ట్రైలర్ రిలీజ్ కానుంది.ఇందుకోసం చెన్నై లో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా సెన్సార్ కూడా పూర్తయింది.యు/ఏ సర్టిఫికెట్ తో దాదాపు 2 గంటల 48 నిమిషాల భారీ రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.

రెట్రో రిలీజ్ డేట్ లో మార్పు లేదు
తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ రెట్రోతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.మే 1న తమిళంతోపాటు తెలుగు ,హిందీలోనూ రిలీజ్ కానుంది.అయితే తెలుగులో అదే డేట్ కు రిలీజ్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.మే 1నుండి రెట్రో రాంపేజ్ స్టార్ట్ కానుందని పోస్టర్ ద్వారా సితార ఎంటెర్టైన్మెంట్స్ ప్రకటించింది.ఈసంస్థ రెట్రోని తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేస్తుంది.

కూలీలో పూజా హెగ్డే
సూపర్ స్టార్ రజినీకాంత్ ,సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు.ఇక ఈసినిమా నుండి లేటెస్ట్ గా ఓ అప్డేట్ వచ్చింది.ఈసినిమా కోసం పూజా హెగ్డే ను తీసుకున్నారు.ఈ సందర్భంగా పూజా హెగ్డే ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.రేపు ఉదయం 11 గంటలకు పూజా పూర్తి లుక్ ను రివీల్ చేయనున్నారు.అయితే ఇందులో తను స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని సమాచారం.

రెట్రో తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్
కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య రెట్రో తో రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక గత నెలలోనే ఈసినిమా తమిళ వెర్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈరోజు తెలుగు, హిందీ టీజర్ లను వదిలారు.2నిమిషాల పాటు సాగిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.ఇందులో సూర్య డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించాడు.ఇక నుంచి అన్ని వదిలేసి ప్రేమతో వుంటానని హీరోయిన్ తో చెప్పడం, హీరో ఫ్లాష్ బ్యాక్ లో తన తండ్రి దగ్గరే పనిచేయడం ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

విజయ్ జన నాయగన్ రిలీజ్ వాయిదా
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 69వ సినిమా జయ నాయగన్. నిన్న ఈసినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ & సెకండ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇక ఈసినిమా రిలీజ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.అనౌన్స్ మెంట్ అప్పుడే ఈసినిమాను అక్టోబర్ 25న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు.కానీ ఆ డేట్ ను అందుకోవడం సాధ్యమయ్యేలా లేదు.షూటింగ్ ఆలస్యంగా పూర్తి కానుందట.నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ల మీద కూడా రిలీజ్ డేట్ ను వేయలేదు.దాంతో ప్రతి ఏడాదికి ఓ సినిమా తో వచ్చే విజయ్ ఈ సారి మాత్రం మిస్ అయ్యేలా వున్నాడు.

దళపతి 69 షూటింగ్ అప్డేట్
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తన 69వ సినిమాలో నటిస్తున్నాడు.ఇదే తనకు చివరి సినిమా కానుంది.ఈసినిమా తరువాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఫుల్ బిజీ అవ్వనున్నాడు.ఇప్పటికే పార్టీ ని కూడా స్థాపించగా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ బరిలో నిలువనుంది విజయ్ పార్టీ.దాంతో విజయ్ తన 69వ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.

సూర్య44 టైటిల్ 'రెట్రో'- యాక్షన్-ప్యాక్డ్ టీజర్ రిలీజ్
వెర్సటైల్ స్టార్ సూర్య హైలీ యాంటిసిపేటెడ్ #Suriya44, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు, ఈ సినిమాకి 'రెట్రో' అనే టైటిల్‌ను చేస్తూ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసిన ఎక్సయిటింగ్ టీజర్ ద్వారా టైటిల్ ని రివిల్ చేశారు. సూర్య, సుబ్బరాజ్‌ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు.

దళపతి 69 లాంచ్
దళపతి విజయ్ నటించనున్న 69వ సినిమా ఈరోజు చెన్నైలో పూజా కార్యక్రమాల తో లాంచ్ అయ్యింది.ఈ వేడుకకు హీరో విజయ్ తోపాటు హీరోయిన్ పూజా హెగ్డే,బాబీ డియోల్ ,డైరెక్టర్ వినోత్ తోపాటు మరికొందరు హాజరయ్యారు.రేపటి నుండి ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.చెన్నైలో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుండగా విజయ్, పూజ హెగ్డే లపై శేఖర్ మాస్టర్ నేతృత్వంలో సాంగ్ ను చిత్రీకరించనున్నారు.

గుంటూరు కారం కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్లు
గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో హిట్ ను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు గుంటూరు కారం అంటూ వచ్చేస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. గత సినిమాల్లో కంటే భిన్నంగా ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో అలరించనున్నట్టు ఇప్పుటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే మధ్యలో కాస్త బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇప్పడు నిర్విరామంగా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది…

గుంటూరు కారం షూటింగ్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం రీసెంట్ గా ఓ కీలకమైన యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.ఇక వచ్చే నెల 2నుండి మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఈషెడ్యూల్ లో మహేష్ బాల్యం కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది.మహేష్ చిన్నప్పటి సన్నివేశాలు సినిమాలో కీలకం కానున్నాయట.ఈ షెడ్యూల్ కు మహేష్ బాబు అవసరం లేకపోవడంతో ప్రస్తుతం ఫ్యామిలీ తో కలిసి ఆయన ఫారిన్ ట్రిప్ లో వున్నాడు.మరో పక్క గుంటూరు కారం కోసం అన్నపూర్ణ స్టుడియో లో ఓ స్పెషల్ సెట్ ను వేస్తున్నారు.ఆగస్టు మూడో వారంలో మహేష్ షూటింగ్ లో పాల్గొననున్నాడు.

గుంటూరు కారం యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికే చాలా టైమ్ తీసుకుంది. నిజానికి సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈసినిమాను కూడా మహేష్ స్టార్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ మధ్యలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడం.. ఆ తరువాత పలు పరిస్థితుల వల్ల చాలా రోజులకి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇక ఎలాగూ షూటింగ్ మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక కొత్త షెడ్యూల్ ను ప్రారంభించాలని అనుకునేలోపు పలు…

బన్నీ బుట్టబొమ్మ పాటకు దళపతి డ్యాన్స్
త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుసు. ఇక ఈ ఆడియో గురించి ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ అందించిన ఆడియో కూడా ఈ సినిమా విజయానికి ఒక కారణమే. ఇప్పటికే యూట్యూబ్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసాయి ఈ పాటలు. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఈ పాటకు ఎంతో మంది సెలెబ్రిటీస్ తమ స్టెప్పులేసి అలరించారు కూడా. ఇప్పుడు ఈపాటకు ఇళయదళపతి విజయ్ కూడా ఆలిస్ట్ లో చేరిపోయారు.

జులై నుండి నాన్ స్టాప్ గా గుంటూరు కారం న్యూ షెడ్యూల్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. మరోవైపు అతడు, ఖలేజా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ కావడంతో ఈసినిమావై మహేష్ అభిమానులే పాటు సినీ ప్రేక్షకులు అందరూ కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక వారి అంచనాలను మరింత పెంచేశాయి రీసెంట్ గా మహేష్ బాబు పుట్టినరోజు కు రిలీజ్ అయిన పోస్టర్ అలానే టైటిల్స్ గ్లింప్స్.

గుంటూరు కారం- లెంగ్తీ షెడ్యూల్ కోసం ప్లాన్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. అయితే ఈసినిమా షూట్ స్లో అండ్ స్టడీ లాగ మధ్య మధ్యలో గ్యాప్ లు తీసుకుంటూ నడుస్తుంది. దీంతో చిత్రయూనిట్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక లెంగ్తీ అండ్ హెవీ షెడ్యూల్ ను ప్లాన్ చేయాలని చూస్తున్నారట. ఈ షెడ్యూల్ లో కీలకమైన హై ఆక్టేన్ సన్నివేశాలను తీయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ లెంగ్తీ షెడ్యూల్ ను కూడా…

గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్
అలా వచ్చాడో లేదో అప్పుడ్ రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో గుంటూరు కారం అనే మాసీ టైటిల్ తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అయితే ఈసినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండీ పెద్దగా అప్ డేట్లు ఇచ్చింది లేదు చిత్రయూనిట్. మధ్యలో ఏదో ఒకటి రెండు పోస్టర్లు రిలీజ్ చేశారు అంతే. దాంతో ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్.

SSMB 28 మాస్ స్ట్రైక్ వీడియో రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూమెంట్ వచ్చేసింది.SSMB 28 టైటిల్ వీడియో ను కొద్దిసేపటి క్రితం విడుదలచేశారు మేకర్స్.మాస్ స్ట్రైక్ పేరుతో కృష్ణ జయంతి సందర్భంగా ఈటైటిల్ వీడియో ను రిలీజ్ చేశారు.మొదట ఈటైటిల్ వీడియో ని ఫ్యాన్స్ చేత థియేటర్ లో లాంచ్ చేయించగా ఆ తరువాత యూట్యూబ్ లోకి వదిలారు.ఇక ఈసినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా గ్లింప్స్ కూడా అదిరిపోయింది.గ్లింప్స్ చూస్తుంటే సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లుగా వుంది అలాగే వీడియోలో మహేష్ లుక్ అదిరిపోయింది.దానికితోడు యాక్షన్స్ సీన్స్ ,థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే గుంటూరు…

ఉస్తాద్ భగత్ సింగ్ లో అవే హైలెట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ షూట్ లతో తీరిక లేకుండా షూట్ లు చేస్తున్నాడు. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఉంది. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిచేసుకొని సెకండ్ షెడ్యూల్ ను లైన్ లో పెట్టనున్నారు.

SSMB 28 న్యూ పోస్టర్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం SSMB 28(వర్కింగ్ టైటిల్ ).ఈసినిమా నుండి కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న టైటిల్ తోపాటు గ్లింప్స్ కూడా విడుదలకానుంది.ఈసందర్భంగా రోజుకో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు మేకర్స్.ఇక తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు.మాస్ లుక్ లో మహేష్ బాబు బరిలోకి దిగుతున్నట్లు వుంది ఈ పోస్టర్.ఈపోస్టర్ మహేష్ కల్ట్ మూవీ ఒక్కడు లోని కబడ్డీ స్టిల్ ను గుర్తుచేసింది.

SSMB28 అప్ డేట్ లోడింగ్
గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకొని ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.