విజయ్ జన నాయగన్ రిలీజ్ వాయిదా

Jana Nayagan release might be postponed

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 69వ సినిమా జయ నాయగన్. నిన్న ఈసినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ & సెకండ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇక ఈసినిమా రిలీజ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.అనౌన్స్ మెంట్ అప్పుడే ఈసినిమాను అక్టోబర్ 25న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు.కానీ ఆ డేట్ ను అందుకోవడం సాధ్యమయ్యేలా లేదు.షూటింగ్ ఆలస్యంగా పూర్తి కానుందట.నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ల మీద కూడా రిలీజ్ డేట్ ను వేయలేదు.దాంతో ప్రతి ఏడాదికి ఓ సినిమా తో వచ్చే విజయ్ ఈ సారి మాత్రం మిస్ అయ్యేలా వున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జన నాయగన్ ను వచ్చే ఏడాది పొంగల్ బరిలో నిలపాలని చూస్తున్నారు.ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ డైరెక్ట్ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

ఇక ఈసినిమా తరువాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు.ఆతరువాత పొలిటీషియన్ గా బిజీగా కానున్నాడు.ఇప్పటికే పార్టీ స్థాపించిన విజయ్ వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ బరిలో తన పార్టీని దింపనున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.