బన్నీ బుట్టబొమ్మ పాటకు దళపతి డ్యాన్స్

Thalapathy Vijay Dances for Allu Arjuns Butta Bomma Song with Pooja Hegde

త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుసు. ఇక ఈ ఆడియో గురించి ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ అందించిన ఆడియో కూడా ఈ సినిమా విజయానికి ఒక కారణమే. ఇప్పటికే యూట్యూబ్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసాయి ఈ పాటలు. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఈ పాటకు ఎంతో మంది సెలెబ్రిటీస్ తమ స్టెప్పులేసి అలరించారు కూడా. ఇప్పుడు ఈపాటకు ఇళయదళపతి విజయ్ కూడా ఆలిస్ట్ లో చేరిపోయారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసలు సంగతేంటంటే.. నిన్న విజయ్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో విజయ్ కు అందరూ బర్త్ డే విషెస్ అందించారు. దీనిలో భాగంగానే పూజా హెగ్డే కూడా తన ఇన్ట్సా ద్వారా విజయ్ కు విషెస్ తెలిపింది. విషెస్ తో పాటు చిన్న వీడియో పోస్ట్ చేసింది. ఆవీడియోలో పూజా హెగ్డే, విజయ్ తో పాటు ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు మరో వ్యక్తి కలిసి బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేయడం చూడొచ్చు. ఈ వీడియో పూజా హెగ్డే, విజయ్ ఇద్దరూ కలిసి నటించిన బీస్ట్ సినిమా సెట్ లో తీసింది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే నా రెడీ అనే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను సెవన్ స్క్రీన్స్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 12 =