త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. అయితే ఈసినిమా షూట్ స్లో అండ్ స్టడీ లాగ మధ్య మధ్యలో గ్యాప్ లు తీసుకుంటూ నడుస్తుంది. దీంతో చిత్రయూనిట్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక లెంగ్తీ అండ్ హెవీ షెడ్యూల్ ను ప్లాన్ చేయాలని చూస్తున్నారట. ఈ షెడ్యూల్ లో కీలకమైన హై ఆక్టేన్ సన్నివేశాలను తీయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ లెంగ్తీ షెడ్యూల్ ను కూడా జూన్ 12వ తేదీ నుండి మొదలుపెట్టనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో చూశాం. మహేష్ బాబు మాస్ లుక్, స్వాగ్ ఆకట్టుకున్నాయి. ఫ్యాన్స్ అయితే మహేష్ ను ఇంత మాస్ మేకోవర్ లో చూస్తున్నందుకు పండగ చేసుకుంటున్నారు. కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. శ్రీలీల మరో హీరోయిన్ గా కనిపించనుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: