దళపతి విజయ్ నటించనున్న 69వ సినిమా ఈరోజు చెన్నైలో పూజా కార్యక్రమాల తో లాంచ్ అయ్యింది.ఈ వేడుకకు హీరో విజయ్ తోపాటు హీరోయిన్ పూజా హెగ్డే,బాబీ డియోల్ ,డైరెక్టర్ వినోత్ తోపాటు మరికొందరు హాజరయ్యారు.రేపటి నుండి ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.చెన్నైలో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుండగా విజయ్, పూజ హెగ్డే లపై శేఖర్ మాస్టర్ నేతృత్వంలో సాంగ్ ను చిత్రీకరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వచ్చే ఏడాది సమ్మర్ లోగా సినిమాను కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.రీసెంట్ గా ఈసినిమా కాస్టింగ్ కూడా రివీల్ చేశారు.అందులో భాగంగా బాబీ డియోల్, ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్,నరైన్,ప్రియమణి,మామితా బైజు లను కీలక పాత్రలకోసం తీసుకున్నారు.పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈసినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా అక్టోబర్ లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక విజయ్ కి ఇదే చివరి సినిమా కానుంది.ఆతరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ గా బిజీ కానున్నాడు.ఇప్పటికే పార్టీ కూడా పెట్టిన విషయం తెలిసిందే.2026 తమిళనాడు అసెంబ్లీ ఎలెక్షన్స్ బరిలో నిలువనుంది విజయ్ పార్టీ.దాంతో వీలైనంత తొందరగా 69వ సినిమాను కంప్లీట్ చేసి పార్టీ పై ఫుల్ ఫోకస్ చేయాలని విజయ్ చూస్తున్నాడు.
ఇక విజయ్ రీసెంట్ గా ది గోట్ తో ప్రేక్షకులముందుకు రాగ ఈ సినిమా 400కోట్లకు పైగా రాబట్టి హిట్ అనిపించుకుంది.ముఖ్యంగా తమిళనాడు లో సెన్సేషనల్ రన్ ను కొనసాగించింది.ది గోట్ తెలుగులోకూడా విడుదల కాగా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























