రెట్రో తెలుగు ట్రైలర్ రిలీజ్

RETRO Trailer Telugu is Out Now

కంగువా తరువాత సూర్య రెట్రోతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.వచ్చే నెల 1న తమిళంతోపాటు తెలుగు ,హిందీలోనూ రిలీజ్ అవుతుంది.ఇక నిన్న ఈసినిమా ఆడియో తోపాటు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఇందులో సూర్య డిఫరెంట్ గెటప్ లలో కనిపించాడు.లవ్ ,లాఫ్టర్ , వార్ అనే కాన్సెప్ట్ తో వస్తుంది ఈసినిమా.ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగులో ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదలచేస్తుండడంతో భారీ సంఖ్యలో థియేటర్లు దొరకనున్నాయి.అయితే అదే రోజు నాని హిట్ 3 కూడా వస్తుంది. దాంతో రెట్రోకి తెలుగులో భారీ పోటీఎదురుకానుంది.కార్తీక్ సుబ్బరాజ్ ఈసినిమాను తెరకెక్కి స్తుండగా పూజా హెగ్డే కథానాయికగా నటించింది.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.

ఇక సూర్య నుండి రీసెంట్ గా వచ్చిన సినిమాలు ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు.ఇక ఇప్పుడు రెట్రో తోనైనా హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తమిళంలో దాదాపు సోలోగా వస్తుండడంతో రెట్రో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.

ఇదిలావుంటే సూర్య ప్రస్తుతం తన 45వ సినిమాలో నటిస్తున్నాడు.ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అబ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఈసినిమాను పూర్తి చేసి సూర్య , వెంకీ అట్లూరి తో సినిమా చేయనున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.