సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికే చాలా టైమ్ తీసుకుంది. నిజానికి సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈసినిమాను కూడా మహేష్ స్టార్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ మధ్యలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడం.. ఆ తరువాత పలు పరిస్థితుల వల్ల చాలా రోజులకి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇక ఎలాగూ షూటింగ్ మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక కొత్త షెడ్యూల్ ను ప్రారంభించాలని అనుకునేలోపు పలు వార్తలు తెరపైకి వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా చిత్రయూనిట్ మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళుతుంది. రీసెంట్ గానే ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. జులై 7వ తేదీన ఈసినిమా కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అయితే ఈషెడ్యూల్ ను హైద్రాబాద్ లోని బీహెచ్ఈఎల్ ప్రాంతంలో చిత్రీకరించనున్నట్టు.. అది కూడా యాక్షన్ ప్యాక్డ్ గా ఈ షెడ్యూల్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈసినిమా నుండి టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. మహేష్ మాస్ అవతార్ అందరికీ నచ్చేసింది. అందుకే ఈసినిమాకోసం అందురూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కనిపించనుంది. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























