దళపతి 69 షూటింగ్ అప్డేట్

Thalapathy 69 shooting Update

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తన 69వ సినిమాలో నటిస్తున్నాడు.ఇదే తనకు చివరి సినిమా కానుంది.ఈసినిమా తరువాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఫుల్ బిజీ అవ్వనున్నాడు.ఇప్పటికే పార్టీ ని కూడా స్థాపించగా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ బరిలో నిలువనుంది విజయ్ పార్టీ.దాంతో విజయ్ తన 69వ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందుకు తగ్గట్లే సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ప్రస్తుతానికి 40శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.మార్చి చివరి కల్లా బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది మూవీ టీం.హెచ్ వినోత్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.

కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి, మమితా బైజు కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమా అక్టోబర్ లో థియేటర్లలోకి రానుంది.

ఇక గత ఏడాది విజయ్ ,ది గోట్ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా మిక్సడ్ టాక్ తో కూడా 400కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.తెలుగులో కూడా ఈసినిమా రిలీజ్ అవ్వగా నిరాశపరిచింది.వెంకట్ ప్రభు ఈసినిమాను డైరెక్ట్ చేయగా ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.