కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ రెట్రోతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.సూర్య ఈసినిమాను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశాడు. ఇందులో తను గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.రేపు ఈసినిమా ఆడియో తోపాటు ట్రైలర్ రిలీజ్ కానుంది.ఇందుకోసం చెన్నై లో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా సెన్సార్ కూడా పూర్తయింది.యు/ఏ సర్టిఫికెట్ తో దాదాపు 2 గంటల 48 నిమిషాల భారీ రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెట్రో తమిళంతోపాటు తెలుగు ,హిందీలో కూడా విడుదలకానుంది.తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.మే 1 న విడుదలకానుంది.
అయితే అదే రోజు నాని హిట్ 3 కూడా వస్తుంది. తెలుగులో ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.దాంతో బాక్సాఫీస్ వద్ద రెట్రో కి హిట్ 3 రూపంలో భారీ పోటీ ఎదురుకానుంది.ఇక రెట్రోపై సూర్య ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కంగువాతోనే సూర్య కం బ్యాక్ ఇస్తాడని ఆశపడ్డ ఫ్యాన్స్ కు ఆసినిమా నిరాశమిగిల్చింది.మరి ఈసారి రెట్రో తోనైనా హిట్ కొట్టి సూర్య ట్రాక్ లోకి రావాలని కోరుకుంటున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: