కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య రెట్రో తో రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక గత నెలలోనే ఈసినిమా తమిళ వెర్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈరోజు తెలుగు, హిందీ టీజర్ లను వదిలారు.2నిమిషాల పాటు సాగిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.ఇందులో సూర్య డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించాడు.ఇక నుంచి అన్ని వదిలేసి ప్రేమతో వుంటానని హీరోయిన్ తో చెప్పడం, హీరో ఫ్లాష్ బ్యాక్ లో తన తండ్రి దగ్గరే పనిచేయడం ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు ,హిందీ టీజర్లకు సూర్య సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం.మొత్తానికి డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.రెట్రోలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.మే 1న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
తమిళంలో ఈసినిమాకు హైప్ మాములుగా లేదు.కంగువా తో నిరాశపరిచిన సూర్య, రెట్రో తో కం బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.మరి ఈ సినిమా సూర్యకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఇక సూర్య ప్రస్తుతం తన 45వ సినిమాలో నటిస్తున్నాడు.ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.సాయి అబ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: