తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ రెట్రోతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.మే 1న తమిళంతోపాటు తెలుగు ,హిందీలోనూ రిలీజ్ కానుంది.అయితే తెలుగులో అదే డేట్ కు రిలీజ్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.మే 1నుండి రెట్రో రాంపేజ్ స్టార్ట్ కానుందని పోస్టర్ ద్వారా సితార ఎంటెర్టైన్మెంట్స్ ప్రకటించింది.ఈసంస్థ రెట్రోని తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెట్రోలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే ఆల్రెడీ తెలుగులో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది.కార్తీక్ సుబ్బరాజ్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా సూర్య ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.ఈనెల 18న తమిళ వెర్షన్ ఆడియోతోపాటు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
అయితే మే 1న నాని హిట్ 3 కూడా రిలీజ్ కానుంది.ఈసినిమాపై కూడా అంచనాలు భారీగా వున్నాయి.దాంతో తెలుగులో బాక్సాఫీస్ వద్ద రెట్రో కి హిట్ 3 రూపంలో భారీ పోటీ ఎదురుకానుంది.ఇక రెట్రో విజయం సాధించడం సూర్యకు తప్పనిసరి కానుంది.గత ఏడాది కంగువాతోనే కం బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు కానీ అది కుదురలేదు.మరి రెట్రో తోనైన హిట్ కొట్టి సూర్య ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
సూర్య ప్రస్తుతం తన 45వ సినిమాలో నటిస్తున్నాడు.ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.సాయి అబ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: