సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం రీసెంట్ గా ఓ కీలకమైన యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.ఇక వచ్చే నెల 2నుండి మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఈషెడ్యూల్ లో మహేష్ బాల్యం కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది.మహేష్ చిన్నప్పటి సన్నివేశాలు సినిమాలో కీలకం కానున్నాయట.ఈ షెడ్యూల్ కు మహేష్ బాబు అవసరం లేకపోవడంతో ప్రస్తుతం ఫ్యామిలీ తో కలిసి ఆయన ఫారిన్ ట్రిప్ లో వున్నాడు.మరో పక్క గుంటూరు కారం కోసం అన్నపూర్ణ స్టుడియో లో ఓ స్పెషల్ సెట్ ను వేస్తున్నారు.ఆగస్టు మూడో వారంలో మహేష్ షూటింగ్ లో పాల్గొననున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించనుంది.ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.ఇక వచ్చే నెల 9న మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా సినిమాకు సంబధించిన సప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది గుంటూరు కారం టీం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: