
ట్యాగ్ · 586 కథనాలు · పేజీ 22


"హరిహర వీరమల్లు "అప్ డేట్

"ఖుషి " మూవీ పై భూమిక స్పందన

"ఖుషి" 20ఇయర్స్ కంప్లీట్

రూమర్లకు చెక్.. పవన్ తోనే ఫిక్స్..!

వకీల్ సాబ్ పై సుప్రీంకోర్టు జడ్జి ప్రశంసలు

పవన్ ను చూసుకుంటున్న నాగవంశీ

పవన్ కళ్యాణ్ క్షేమం కోరుతూ మహేష్ బాబు ట్వీట్

పవన్ కు కరోనా పాజిటివ్ - కొనసాగుతున్నచికిత్స

పవన్ కళ్యాణ్ 100 కోట్ల షేర్ మూవీ "వకీల్ సాబ్"

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్ 'పవన్' ను హత్తుకున్నాడు

"వకీల్ సాబ్ " పై మహేష్ బాబు ప్రశంసలు

'వకీల్ సాబ్' అదే వేడి.. అదే వాడి

'వకీల్ సాబ్' కు ఏపీ హైకోర్టు బంపర్ ఆఫర్

థ్యాంక్స్ పూరీ.. బద్రి-నంద కాంబో రాక్స్

వకీల్ సాబ్ తెలుగు మూవీ పబ్లిక్ టాక్

పవన్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను

పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్
దర్శకుడు సాచి దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మలయాళ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో”అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

"హరిహర వీరమల్లు "అప్ డేట్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యం లో క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 17 వ శతాబ్దం లో మొఘల్ , కుతుబ్ షాహి కాలం నాటి చట్టాలను ఎదిరించే వీరుడిగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. బాలీవుడ్ హీరో అర్జున్ రామ్ పాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు .

"ఖుషి " మూవీ పై భూమిక స్పందన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , భూమిక జంటగా శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎ ఎమ్ రత్నం నిర్మాతగా తమిళ నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన “ఖుషి “మూవీ 2001 సంవత్సరం ఏప్రిల్ 27 తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ తమిళ మూవీ “ఖుషి” కి తెలుగు రీమేక్ గా రూపొందింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన “ఖుషి”మూవీ లో హీరో పవన్ కళ్యాణ్ స్టైల్ , మేనరిజం, డైలాగ్స్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నాయి. మణిశర్మ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

"ఖుషి" 20ఇయర్స్ కంప్లీట్
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎ ఎమ్ రత్నం నిర్మాతగా తమిళ నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , భూమిక జంటగా రూపొందిన "ఖుషి "మూవీ 2001 సంవత్సరం ఏప్రిల్ 27 తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ తమిళ మూవీ "ఖుషి" కి తెలుగు రీమేక్ గా రూపొందిన "ఖుషి"మూవీ లో హీరో పవన్ కళ్యాణ్ స్టైల్ , మేనరిజం యూత్ కు బలమైన ముద్ర వేశాయి. హీరో పవన్ కళ్యాణ్ కు "ఖుషి "మూవీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

ఓటీటీలోకి వస్తున్న 'వకీల్ సాబ్'
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా పవన్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పవన్ రీఎంట్రీ అంటే ఆమాత్రంఉంటుంది అని ఈసినిమాతో నిరూపించారు. వేణు శ్రీరామ్ కూడా తన మీద పెట్టుకున్న నమ్మకానికి వంద శాతం న్యాయం చేశాడు. ఇక ఇదే జోష్ తో పవన్ కూడా దిల్ రాజుతో మరో సినిమా చేయడానికి.. రెడీ అయిపోయినట్టు ఇప్పటికే పలుకథనాలు వస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు వకీల్ సాబ్ ఓటీటీలోకి రానుంది .

రూమర్లకు చెక్.. పవన్ తోనే ఫిక్స్..!
2019లో విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత హరీష్ నుండి మరే సినిమా రాలేదు. అయితే పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ సంస్థ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈసినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా మరో టాపిక్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

వకీల్ సాబ్ పై సుప్రీంకోర్టు జడ్జి ప్రశంసలు
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈసినిమా సూపర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రంలో లాయర్ గా పవన్ ఇచ్చిన అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు పవన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ని ‘వకీల్ సాబ్’ దాటేసింది. ఇప్పటివరకూ ‘వకీల్ సాబ్’ రూ.80 కోట్ల షేర్ మార్కును దాటేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా టైమ్. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సినిమాకు వెళ్ళాలా వద్దా అనే డైలమాలో పడ్డారు ప్రేక్షకులు. దీనితో కలెక్షన్స్ కాస్త…

పవన్ ను చూసుకుంటున్న నాగవంశీ
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే కదా. ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాలేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా ముందుగా నెగెటివ్ వచ్చింది. ఆ తరువాత జ్వరం, ఒళ్ళు నొప్పులు రావడంతో మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. . ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న పవన్ కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇక పవన్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ క్షేమం కోరుతూ మహేష్ బాబు ట్వీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడడంతో అభిమానులు సంతోషంగా ఉండగా తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కు కరోనా సోకడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు తమ హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు పవన్ క్షేమాన్ని కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

పవన్ కు కరోనా పాజిటివ్ - కొనసాగుతున్నచికిత్స
కరోనా సెకండ్ వేవ్ లో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. వకీల్ సాబ్ టీమ్ కు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే హీరోయిన్ నివేదా థామస్ కరోనా బారిన పడింది. ఆ తర్వాత మరికొందరికి సైతం కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న తన స్పీచ్ తో టాప్ వన్ ట్రెండింగ్ లో నిలిచిన బండ్ల గణేష్ రెండోసారి కోరోనా బారిన పడ్డారు. ఈనేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గత కొద్దిరోజులుగా ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కు కరోనా సోకిన విషయాన్ని జనసేన పార్టీ అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రస్తుతం పవన్…

పవన్ కళ్యాణ్ 100 కోట్ల షేర్ మూవీ "వకీల్ సాబ్"
బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్ 'పవన్' ను హత్తుకున్నాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చూస్తూనే ఉన్నాం. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా వచ్చి బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అవుతున్నా ఇంకా మంచి కలెక్షన్సే రాబడుతుంది. ఇక తొలి షో నుండి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించగా, ప్రతి ఒక్కరు మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా మహళా ప్రాధాన్యత సినిమా అవ్వడంతో మహిళలకు బాగా చేరువైంది ఈసినిమా. పవన్ కం బ్యాక్ సినిమా వకీల్ సాబ్‌ను అభిమానులే కాదు తోటి హీరోలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియావేదికగా…

వకీల్ సాబ్ ఓటీటీ రిలీజ్ - అన్నీ రూమర్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా రోజుల తరువాత వచ్చిన వకీల్ సాబ్ మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. వకీల్ సాబ్ విడుదలను అభిమానులు ఒక పండగలా సెలబ్రెట్ చేసుకున్నారు. కలెక్షన్స్ గురించి నిర్మాతలు పెద్దగా నోరు విప్పట్లేదు కానీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా సినిమా 90కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం.

"వకీల్ సాబ్ " పై మహేష్ బాబు ప్రశంసలు
బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ భారీ అంచనాలతో, రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. ఫస్ట్ టైమ్ లాయర్ గా నటించిన పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రకాష్ రాజ్ , అంజలి , నివేద , అనన్య తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

'వకీల్ సాబ్' అదే వేడి.. అదే వాడి
నిన్నటి నుండి ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ గురించే వినిపిస్తుంది. కరోనా తరువాత థియేటర్లు ఓపెన్ అయిన తరువాత ఇంత సందడి.. హడావుడి మరే సినిమాకు కనిపించలేదు. ఇక ఈసినిమా కూడా అదే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. మరోసారి పవన్ మ్యానియా ఏంటో వకీల్ సాబ్ సినిమా చూపించింది.

'వకీల్ సాబ్' కు ఏపీ హైకోర్టు బంపర్ ఆఫర్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు మూడేళ్లు వెయుట్ చేసిన పవన్ ఫ్యాన్స్ కు ఈసినిమా ఫుల్ మీల్స్ లాగ దొరికింది. సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు ఉన్నాయో.. ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా ఈసినిమా సూపర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఎక్కడ చూసినా థియేటర్లు హౌస్ ఫుల్ తో కళకళలాడిపోతున్నాయి. పవన్ సినిమా ఈరేంజ్ లో ఉంటుందని మరోసారి చూపించారు ఫ్యాన్స్ కూడా.

థ్యాంక్స్ పూరీ.. బద్రి-నంద కాంబో రాక్స్
నువ్వు నందా అయితే నేను బద్రి, బద్రినాధ్ అయితే ఏంటి.. ఈ డైలాగ్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా నుండే కదా పవన్ క్రేజ్ అంత పెరిగిపోయింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇక ప్రకాష్ రాజ్- పవన్ మధ్య వచ్చే డైలాగే ఇది. మరి ఇప్పుడు ఈసినిమా గురించిన ప్రస్తావన ఎందుకంటే.. నేడు వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఈసినిమాను గుర్తుచేసుకున్నారు. అంతేకాదు.. ఈసందర్భంగా పూరీ కి కూడా తన ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పాడు.

వకీల్ సాబ్ తెలుగు మూవీ పబ్లిక్ టాక్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత వస్తున్న సినిమా వకీల్ సాబ్. హిందీ లో సూపర్ హిట్ అయిన పింక్ కు ఇది రీమేక్. తమిళ్ లో నెర్కొండ పార్వాయి సినిమా కూడా పింక్ రీమేకే. అక్కడ కూడా ఈసినిమా హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో అందులోనూ పవన్ హీరో కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వకీల్ సాబ్ తెలుగు మూవీ రివ్యూ - పవన్ ఈజ్ బ్యాక్
ఓవరాల్ గా చెప్పాలంటే పవన్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకునే సినిమా. మూడేళ్లు ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టారు. కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరికీ ఈసినిమా నచ్చుతుంది.

పవన్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను
పవర్ స్టార్ సినిమా కోసం సినీ సెలబ్రిటీస్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్లు తరువాత పవన్ ఎంట్రీ ఇస్తుడంటో వెండితెరపై పవన్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అటు ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ఇటు మెగా ఫ్యామిలీ కూడా అదే ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈనేపథ్యంలో మెగాస్టార్ చిరు తన ట్విట్టర్ ద్వారా తను కూడా పవన్ ను చూడటం కోసం ఎదురుచూస్తున్నాడు తెలిపాడు.