వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా పవన్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పవన్ రీఎంట్రీ అంటే ఆమాత్రంఉంటుంది అని ఈసినిమాతో నిరూపించారు. వేణు శ్రీరామ్ కూడా తన మీద పెట్టుకున్న నమ్మకానికి వంద శాతం న్యాయం చేశాడు. ఇక ఇదే జోష్ తో పవన్ కూడా దిల్ రాజుతో మరో సినిమా చేయడానికి.. రెడీ అయిపోయినట్టు ఇప్పటికే పలుకథనాలు వస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు వకీల్ సాబ్ ఓటీటీలోకి రానుంది .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైంది. విడుదలైన మూడు నాలుగు రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టింది. తరువాత కరోనా ప్రభావంతో కలెక్షన్స్ రావడం కూడా తగ్గిపోయాయి. నిజానికి దీన్ని అంత త్వరగా ఓటీటీలో ప్రసారం చేయొద్దని అనుకున్నారు.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు మూత పడటంతో అదో బెటర్ ఆప్షన్ అని ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ నెల 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ ప్రోమోను సైతం రిలీజ్ చేశారు చిత్ర నిర్మాణ సంస్థ.
He is his own judge, in his court… only the truth will be served!
New trailer out now!
Meet #VakeelSaabOnPrime on April 30. @PrimeVideoIN@PawanKalyan #SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @MusicThaman @BayViewProjOffl pic.twitter.com/vCvBFA2I3O— Sri Venkateswara Creations (@SVC_official) April 27, 2021
పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్ కూడా చేస్తున్నాడు. ఈసినిమాను నాగవంశీ తన బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఇక ఇటీవలే పవన్ కరోనా బారినపడ్డారు. రీసెంట్ గానే కరోనా నెగిటివ్ వచ్చింది. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న తరువాత పవన్ మళ్లీ షూటింగ్ లో పాల్గొననున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: