మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యం లో క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 17 వ శతాబ్దం లో మొఘల్ , కుతుబ్ షాహి కాలం నాటి చట్టాలను ఎదిరించే వీరుడిగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. బాలీవుడ్ హీరో అర్జున్ రామ్ పాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“హరిహర వీరమల్లు ” మూవీ యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో చాలా సినిమాలు విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.”హరిహరవీరమల్లు” చిత్రాన్ని 2022 సంక్రాంతి బరిలో నిలుపనున్నట్టు నిర్మాత ఏఎమ్ రత్నం తెలిపారు. సంక్రాంతి పండుగకు ఇంకా చాలా సయయం ఉందని, సినిమా రిలీజ్పై అనుమానాలేవి పెట్టుకోవద్దని ఆయన సూచించారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























