పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , భూమిక జంటగా శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎ ఎమ్ రత్నం నిర్మాతగా తమిళ నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన “ఖుషి “మూవీ 2001 సంవత్సరం ఏప్రిల్ 27 తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ తమిళ మూవీ “ఖుషి” కి తెలుగు రీమేక్ గా రూపొందింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన “ఖుషి”మూవీ లో హీరో పవన్ కళ్యాణ్ స్టైల్ , మేనరిజం, డైలాగ్స్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నాయి. మణిశర్మ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఖుషి “మూవీ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా హీరోయిన్ భూమిక స్పందించారు. తాను కథానాయికగా నటించిన చిత్రాలలో “ఖుషి “మూవీ అంటే తనకు చాలా ఇష్టమనీ , ఈ మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నాననీ , అప్పుడే ఈ సినిమాలో నటించి 20 ఏళ్లు అయిందా? అనే ఆశ్చర్యం కలుగుతోందనీ , ఈ మూవీ లోని ‘సిద్ధు’ , ‘మధు’ పాత్రలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండటం విశేషమనీ , ‘అమ్మాయే సన్నగా’ .. ‘చెలియ చెలియా’ పాటలంటే తనకు చాలా ఇష్టమనీ , పవన్ కల్యాణ్ బాగా నటించారనీ , ఇంతకాలమైనా ఈ సినిమాను గురించి మాట్లాడుకుంటున్నందుకు సంతోషంగా ఉందనీ హీరోయిన్ భూమిక ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: