
ట్యాగ్ · 67 కథనాలు


విశ్వంభర.. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీ బిజీగా

మెగా 157 ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం

పవన్ బర్త్ డే రోజు రానున్న సప్రైజ్ లు ఇవే

హరి హర వీరమల్లు తో కల నిజమైంది

ఆస్కార్ జ్యూరీలో RRR కు పెద్ద పీట

ఎన్టీఆర్ సింహాద్రి కోసం మాస్ కా దాస్

పద్మ శ్రీ అందుకున్న కీరవాణి

ఇంటర్నేషనల్ సెన్సేషన్ కు ఏడాది

మగధీర రీరిలీజ్ పై మేకర్స్ క్లారిటీ

దర్శకుడు రాజమౌళి ఆస్కార్ పార్టీ

కీరవాణి గారు యుగపురుషుడు లాంటి వారు
కీరవాణి గారు యుగపురుషుడు లాంటి వారని పేర్కొన్నారు డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. ఈ మేరకు ఆయన శుక్రవారం మహేష్ బాబు బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంటూ తన కొత్త ప్రాజెక్ట్‌కి సంబధించి క్రేజీ అప్డేట్స్ అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కి కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తెలిపేందుకు ప్రెస్ మీట్ నిర్వహింరు. ఈ సందర్భంగా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి కీరవాణితో ఆయనకున్న అనుబంధం గురించి వివరించారు.

విశ్వంభర.. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీ బిజీగా
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. సురభి ,ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

మెగా 157 ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్‌తో ఒక కొత్త చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు చిత్ర దర్శకుడు వశిష్ట సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అందులో.. " ‘మెగా 157’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. త్వరలోనే మీ అందరినీ సరికొత్త అనుభూతినిచ్చే సినిమాటిక్ అడ్వెంచర్‌కు తీసుకెళ్లేందుకు మేము సిద్ధం" అని వశిష్ట పేర్కొన్నారు. ఈ సందర్భంగా వశిష్ట ‘మెగా 157’ టీమ్‌తో కలసి దిగిన ఫొటోను షేర్ చే శారు. కాగా ఈ సినిమా సోషియో ఫాంటసీగా రూపొందనుంది.

పవర్ స్టార్ బర్త్ డే వేళ.. హరి హర వీరమల్లు కొత్త పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలుపుతూ అనేక పోస్టులు పెడుతున్నారు. ఇక మరోవైపు పవన్ కొత్త చిత్రాల నిర్మాతలు కూడా ఆయా సినిమాలకు సంబంధించి కీలక అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న అర్దరాత్రి 12:17కి పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమాలోని న్యూలుక్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కి స్పెషల్ గిఫ్ట్ అందించింది చిత్ర యూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ ఒక పోస్ట్ చేసింది. అందులో.. ఇక 'ఈ సంతోషకరమైన రోజున మన హరి హర వీరమల్లు యొక్క అసాధారణమైన ధైర్యసాహసాలు…

పవన్ బర్త్ డే రోజు రానున్న సప్రైజ్ లు ఇవే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న తన పుట్టిన రోజును జరుపుకోనున్నాడు.ఈసందర్భంగా తను ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుండి సప్రైజ్ లు ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.అందులో భాగంగా ఓజీ నుండి అదే రోజు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఈవిషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటెర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.ఈరోజు సాయంత్రం రిలీజ్ టైం కూడా చెప్పనున్నారు. ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

69వ జాతీయ సినిమా అవార్డుల్లో సత్తా చాటిన టాలీవుడ్
సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ఈ చలనచిత్ర పురస్కారాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడగా.. 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఇక ఈ జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ సత్తా చాటింది. మునుపెన్నడూ లేనిస్థాయిలో పలు విభాగాల్లో అనేక అవార్డులను కొల్లగొట్టింది. వివిధ విభాగాల్లో 10 జాతీయ అవార్డులు దక్కించుకుని జాతీయ స్థాయిలో సగర్వంగా నిలిచింది తెలుగు సినిమా.

జెంటిల్ మేన్ 2 మోషన్ పోస్టర్ రిలీజ్
ఈమధ్య సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే కదా. సినిమా హిట్ అయితే వెంటనే సీక్వెల్స్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక ఇప్పుడు మరో క్లాసిక్ సినిమా కూడా సీక్వెల్ కు సిద్దమవుతుంది. ఈసినిమా మరేదో కాదు.. శంకర్ దర్శకత్వంలో అర్జున్, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చి సంచలనం సృష్టించిన జెంటిల్‌మేన్ సినిమా. 1993లో తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయి ఓ సంచలనం సృష్టించింది. అర్జున్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. కృష్ణమూర్తి పాత్రలో తన సత్తా చాటాడు. ఇక శంకర్ కూడా తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. అప్పట్లో కె.జి. కుంజమోన్ ఈసినిమాను నిర్మించారు. ఇప్పుడు…

జెంటిల్‌మెన్ 2- గ్రాండ్ గా ప్రారంభం కానున్న కంపోజింగ్
శంకర్ దర్శకత్వంలో అర్జున్, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చిన జెంటిల్‌మేన్ సినిమా తమిళ, తెలుగు భాషల్లో అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 1993లో రిలీజ్ అయిన ఈసినిమా ప్రభంజనం సృష్టించింది. అర్జున్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. కృష్ణమూర్తి పాత్రలో తన సత్తా చాటాడు. ఇక శంకర్ కూడా తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. కె.జి. కుంజమోన్ ఈసినిమాను నిర్మించారు. ఇప్పుడు శంకర్ వంటి గొప్ప ప్రతిభావంతులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం చేసుకున్నారు.

హరి హర వీరమల్లు తో కల నిజమైంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొదటిసారి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ లో పవన్ నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెండేళ్ల క్రితమే వెళ్లింది. కానీ ఇంతవరకూ రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. ఈసినిమా కంటే వెనుక మొదలుపెట్టిన సినిమాలు కూడా ఇప్పటికే రిలీజ్ అవుతున్నాయి. షూటింగ్ మాత్రం చాలా వరకూ పూర్తి చేసుకుంది. గత కొద్దిరోజులుగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు.

ఆస్కార్ జ్యూరీలో RRR కు పెద్ద పీట
ఆర్ఆర్ఆర్ సినిమా సినిమా స్థాయి అంతర్జాతీయంగా ఎంత పెరిగిందో చూశాం. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ ఇంకా అల్లూరి సీతారామరాజు జీవితచరిత్ర ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమా గత ఏడాది రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఇక ఇక్కడ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. ఈసినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు భారతీయ సినిమా ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లింది. ఈ చిత్రంలోని నాటు నాటు…

ఎన్టీఆర్ సింహాద్రి కోసం మాస్ కా దాస్
స్టార్ హీరోల సినిమాలకు వారి పుట్టినరోజులకు రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎంతో మంది హీరోల సినిమాలను రీరిలీజ్ చేశారు. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాతో పాటు పలువురు హీరోల సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా తన ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయగా అది ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజుకు సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

పద్మ శ్రీ అందుకున్న కీరవాణి
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఈసినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ ను సైతం అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్శశ్రీ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఏడాది మొత్తం 106 పద్మ పురస్కారాలు ప్రకటించగా.. మార్చి 22 న తొలి విడతలో 50 మందికి పైగా ఇచ్చారు. ఇక ఇప్పుడు మిగిలిన వారందరికీ పురస్కారాలు అందచేశారు. దీనిలో భాగంగానే కీరవాణి కూడా పద శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

ఇంటర్నేషనల్ సెన్సేషన్ కు ఏడాది
ఒక లెజెండరీ డైరెక్టర్, ఇద్దరు స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ మరి ఇలాంటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులకు కూడా ఎంత ఆసక్తికరంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందులోనూ ఎన్ని అంచనాలు ఉంటాయో కూడా తెలిసిందే. మరి అలాంటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. అప్పటికే బాహుబలి సినిమా సంచలనం సృష్టించండంతో నెక్ట్స్ రాజమౌళి నుండి ఎలాంటి సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అందరూ. అలాంటి తరుణంలోనే జస్ట్ ఒక ఫొటో రిలీజ్ చేసి ఆ ఒక్క ఫొటోతోనే సినిమాపై హైప్ పెంచేశారు.

న్యూ జెర్సీ లో నాటు నాటు సాంగ్ కు టెస్లా కార్ల లైట్ షో
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది.

మగధీర రీరిలీజ్ పై మేకర్స్ క్లారిటీ
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో 'మగధీర' సినిమాకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎస్‌ఎస్ రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. హార్స్ రైడింగ్, కాజల్ గ్లామర్, శ్రీహరి-రామ్‌చరణ్ మధ్య డైలాగ్ వార్ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది ఈసినిమా. మగధీర’ చిత్రం మొత్తం తొమ్మిది నంది అవార్డులు కైవసం చేసుకుంది.

ఆస్కార్ అవార్డు తో హైదరాబాద్ కు చేరుకున్న ఆర్ ఆర్ ఆర్ టీమ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు…

అమెరికన్ స్టార్ కంపోజర్ సర్ ప్రైజర్ కు కీరవాణి ఎమోషనల్
దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపించాడు. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తరువాత ఈసినిమా గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అయి అన్ని భాషల్లో ఈసినిమా కోట్లు రాబట్టుకుంది. ఇక్కడ మాత్రమే కాదు రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఇక ఈసినిమా అంతర్జాతీయంగా కూడా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా.

జపాన్ లో 20 వారాలుగా 202 థియేటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ కేక
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు…

దర్శకుడు రాజమౌళి ఆస్కార్ పార్టీ
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్…

ధూల్ పేట్ గల్లీ నుండి రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వరకూ
ధూల్ పేట్ కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్ ఊరేగింపుల్లోనూ , ఫంక్షన్స్ లోనూ పాటలు పాడుతుండేవారు. రాహుల్ తండ్రి ఓ సాదారణ బార్బర్. దీంతో పాటలు పాడాలన్నా , వీడియోలు చేయాలన్న చేతిలో డబ్బులు ఉండేవి కావు. ఎన్నో నిద్రలేని రాత్రులూ, ఆరాటాలు, పోరాటాల నడుమ ఫ్రెండ్స్ సాయంతో యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. చిన్న చిన్నగా ప్రచారం పొందుతూ.. ఇండిపెండెంట్ సాంగ్స్ తో యూట్యూబ్ లో పాపులర్ అయ్యారు. జోష్ మూవీ తో రాహుల్ టాలీవుడ్ కు సింగర్ గా పరిచయం అయ్యారు. దమ్ము , ఈగ , షిర్డీ సాయి , సవ్యసాచి వంటి మూవీస్ లో సంగీత దర్శకుడు కీరవాణి రాహుల్ కు సింగర్ గా అవకాశం కల్పించారు.