అమెరికన్ స్టార్ కంపోజర్ సర్ ప్రైజర్ కు కీరవాణి ఎమోషనల్

mm keeravaani received a special video from richard carpente

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపించాడు. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తరువాత ఈసినిమా గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అయి అన్ని భాషల్లో ఈసినిమా కోట్లు రాబట్టుకుంది. ఇక్కడ మాత్రమే కాదు రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఇక ఈసినిమా అంతర్జాతీయంగా కూడా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా కీరవాణికి ప్రముఖ అమెరికన్ సంగీత దర్శకుడు రిచర్డ్ కార్పెంటర్ నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ అందింది. సోషల్ మీడియా వేదికగా కీరవాణిని, గీత రచయిత చంద్రబోస్ ను సర్ ప్రైజ్ చేశారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచినందుకు అభినందనలు తెలుపుతూ.. మా కుటుంబం నుంచి ఓ చిన్న కానుక అంటూ స్వయంగా కీబోర్డు వాయిస్తూ ‘టాప్ ఆఫ్ ద వరల్డ్’ గీతాన్ని ఆలపించారు. రిచర్డ్ కార్పెంటర్ తో పాటు ఆయన కుమార్తెలు కూడా ఆయనతో కలిపి ఆలపించడం విశేషం.. ఈ వీడియోను రిచర్డ్ కార్పెంటర్ పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోపై కీరవాణి స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. నేను అస్సలు ఊహించని విషయం ఇది. ఆనందంతో నాకు కన్నీళ్లు వస్తున్నాయి. ప్రపంచంలోనే అద్భుతమైన బహుమతి అంటూ రాసుకొచ్చారు.

ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 18 =