కీరవాణి గారు యుగపురుషుడు లాంటి వారని పేర్కొన్నారు డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. ఈ మేరకు ఆయన శుక్రవారం మహేష్ బాబు బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంటూ తన కొత్త ప్రాజెక్ట్‌కి సంబధించి క్రేజీ అప్డేట్స్ అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కి కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తెలిపేందుకు ప్రెస్ మీట్ నిర్వహింరు. ఈ సందర్భంగా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి కీరవాణితో ఆయనకున్న అనుబంధం గురించి వివరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. “ఈ వేడుకుకు చాలా మెరపులు వున్నాయి. సినిమాకి సంగీతం, సాహిత్యం ప్రాణంగా భావిస్తుంటాను. కీరవాణి గారు యుగపురుషుడు లాంటి వారు. ఒక సంగీత దర్శకుడికి ఎంత ప్రావీణ్యం ఉండాలో అంత ప్రావీణ్యం వున్న సంగీత దర్శకుడాయన. ఆయనతో నా మొదటి సినిమాకి పని చేయడం నా అదృష్టం. ఆయన నాకు మర్చిపోలేని పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు” అని గుర్తుచేసుకున్నారు.
ఇంకా ఇలా అన్నారు.. “అలాంటి మహానుభావుడితో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన కథ విని చాలా ఆనందంగా ఫీలయ్యారు. ఒక పెద్దన్నయ్యలా సలహాలు సూచనలు ఇచ్చారు. ఆయనకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాహిత్య చిచ్చరపిడుగు చంద్రబోస్ గారు ఈ సినిమాకి సాహిత్యం అందిస్తున్నారు. ఆయన సాహిత్యం మహా అద్భుతంగా వుండబోతోంది” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ కథని నేను రాసుకున్నాను. దీనికి అర్ధవంతమైన మాటలు రాయడానికి సమర్దవంతమైన మాటల రచయిత కావాలి. ‘కంచె’ సినిమా చూసినప్పుడే సాయి మాధవ్ బుర్రాతో పని చేయాలని అనుకున్నాను. ఆయన అన్ని సినిమాలకు న్యాయం చేశారు. ప్రతి సినిమాకి గొప్పగా ఎదిగారు. ఇప్పుడు ఈ సినిమాతో ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా వుంది” అని అన్నారు దర్శకుడు వైవిఎస్ చౌదరి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: