జెంటిల్‌మెన్ 2- గ్రాండ్ గా ప్రారంభం కానున్న కంపోజింగ్

interesting update on gentleman 2 movie

శంకర్ దర్శకత్వంలో అర్జున్‌, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చిన జెంటిల్‌మేన్‌ సినిమా తమిళ, తెలుగు భాషల్లో అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 1993లో రిలీజ్ అయిన ఈసినిమా ప్రభంజనం సృష్టించింది. అర్జున్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. కృష్ణమూర్తి పాత్రలో తన సత్తా చాటాడు. ఇక శంకర్ కూడా తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. కె.జి. కుంజమోన్‌ ఈసినిమాను నిర్మించారు. ఇప్పుడు శంకర్‌ వంటి గొప్ప ప్రతిభావంతులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు చాాలా గ్యాప్ తరువాత జెంటిల్‌మెన్2 ను సినిమాను నిర్మిస్తున్నారు.
మొదటి భాగానికి రెండింతలు ఉండేలా జెంటిల్‌మెన్ 2 చిత్రాన్ని నిర్మించనున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా కంపోజిషన్ ను గ్రాండ్ గా ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. కె.టి. కుంజుమోన్ కొచ్చిలోని ప్రపంచ ప్రఖ్యాత బోల్గట్టి ప్యాలెస్ ఐలాండ్‌లో పాటల కంపోజింగ్ సెషన్‌ను నిర్వహించనున్నారు. ఎం.ఎం. కీరవాణి జూలై 19న కవిపేరరసు పాటల రచయిత వైరముత్తుతో కలిసి ఈ సెషన్ ను నిర్వహించనున్నారు.

కాగా ఎ. గోకుల్ కృష్ణ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈసినిమాకు అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది గురించిన వివరాలు త్వరలో తెలియజేస్తారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.