స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆస్కార్ వేడుకలు ముగియడంతో, ఇటీవలే ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో హైదరాబాద్ లో ఆస్కార్ అవార్డుతో రాజమౌళి, కీరవాణి, సింగర్ కాలభైరవ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. సింగర్ కాలభైరవ మాట్లాడుతూ.. ఆస్కార్ అందుకోవడం, స్టేజి పై సాంగ్ పెర్ఫార్మ్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇక రాజమౌళి జై హింద్ అనే ఒక్క మాటతో అందరి మనసులను దోచుకున్నారు.
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: