స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న నాటు నాటు సాంగ్ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. సినీ ప్రముఖుల నుంచి మొదలుకుని బిజినెస్ మేన్ల వరకు.. క్రీడా ప్రముఖుల నుంచి మొదలుకుని రాజకీయ ప్రముఖుల వరకు.. అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ నాటు నాటు పాటపై సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుండటం విశేషం. తాజాగా నాటు నాటు సాంగ్‌పై టెస్లా కార్లను ఉపయోగించి చేసిన లైట్ షో వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నాటు నాటు సాంగ్ బీట్స్‌కి, మ్యూజిక్‌కి అనుగుణంగా కార్ల లైట్స్, ఇండికేటర్స్ ఆన్ ఆఫ్ చేస్తూ చేసిన టెస్లా కార్ల లైట్ షో వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. న్యూ జెర్సీ లాంటి గ్లోబల్ సిటీలో ఈ వీడియోను షూట్ చేశారు.
Truly overwhelmed by this tribute to #NaatuNaatu from New Jersey !
Thank you @vkkoppu garu, #NASAA, @peoplemediafcy and everyone associated with this incredible and ingenious @Tesla Light Show…:) It was a stunning show. #RRRMovie @elonmusk pic.twitter.com/JKRfTZdvLK
— rajamouli ss (@ssrajamouli) March 21, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.