ధూల్ పేట్ కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్ ఊరేగింపుల్లోనూ , ఫంక్షన్స్ లోనూ పాటలు పాడుతుండేవారు. రాహుల్ తండ్రి ఓ సాదారణ బార్బర్. దీంతో పాటలు పాడాలన్నా , వీడియోలు చేయాలన్న చేతిలో డబ్బులు ఉండేవి కావు. ఎన్నో నిద్రలేని రాత్రులూ, ఆరాటాలు, పోరాటాల నడుమ ఫ్రెండ్స్ సాయంతో యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. చిన్న చిన్నగా ప్రచారం పొందుతూ.. ఇండిపెండెంట్ సాంగ్స్ తో యూట్యూబ్ లో పాపులర్ అయ్యారు. జోష్ మూవీ తో రాహుల్ టాలీవుడ్ కు సింగర్ గా పరిచయం అయ్యారు. దమ్ము , ఈగ , షిర్డీ సాయి , సవ్యసాచి వంటి మూవీస్ లో సంగీత దర్శకుడు కీరవాణి రాహుల్ కు సింగర్ గా అవకాశం కల్పించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్ గా రాహుల్ విజయం సాధించారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్ రచన , కాలభైరవ తో కలసి రాహుల్ పాడిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని ఆస్కార్ అవార్డు సాధించింది. ఇప్పుడు సింగర్ రాహుల్ పేరు తెలియని తెలుగు సంగీత ప్రియుడు ఉండరంటే అతిశయోక్తికాదు. ఎక్కడ చూసినా , విన్నా రాహుల్ పాడిన పాటే వినిపిస్తోంది. అంతేకాదు ఎక్కడో దూల్ పేట్ బస్తీలో పుట్టిన ఈ సామాన్యుడు.. ఏకంగా ప్రపంచప్రఖ్యాత ఆస్కార్ స్టేజీపై పాటను పాడడం.. మామూలు విషయం కాదు.
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: