
ట్యాగ్ · 226 కథనాలు


చిరు -అనిల్ మూవీ రేపే లాంఛ్

భోళా శంకర్ కు సూపర్ స్టార్ బెస్ట్ విషెస్

భోళాశంకర్ డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న సుశాంత్

ఘనంగా మొదలైన నాని 30

అటు విహార యాత్ర - ఇటు వీరయ్య యాత్ర

వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫిక్స్

ఆసక్తికరంగా మారిన వాల్తేరు వీరయ్య రిలీజ్

రామ్ చరణ్ పై చిరంజీవి ప్రశంసలు

ఓజీ స్పెషల్ స్క్రీనింగ్.. మెరిసిన మెగా ఫ్యామిలీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఓజీ' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో సైతం వసూళ్ళలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ తరుణంలో మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగించే వార్త వెలువడింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సినిమాను ఒక స్పెషల్ స్క్రీనింగ్‌లో వీక్షించారు.

చిరు -అనిల్ మూవీ రేపే లాంఛ్
మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రేపు ఉగాదికి ఈసినిమా లాంఛ్ కానుంది. రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించనున్నారు.జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది.సినిమాను తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేయనున్నారు.

ప్రభాస్ గొప్ప మనస్సు.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం
రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనస్సు చాటుకున్నారు. వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. దీనిలో భాగంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు భారీ విరాళం అందించారు. అయితే గతంలో కూడా ప్రభాస్ తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవడం అందరికీ తెలిసిన విషయమే.

ఓటీటీలోకి వచ్చేసిన భోళాశంకర్
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా భోళాశంకర్. తమిళ్ లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్నసంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 11వవ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా ఇక్కడ మాత్రం ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆడియన్స్ ముందుకి…

భోళాశంకర్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్
ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో వచ్చి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి.ఈసినిమా 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ఈసినిమా తరువాత గత నెలలో భోళా శంకర్ తో చిరు మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి రానుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈనెల 15నుంచి తెలుగుతోపాటు హిందీ,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.

భోళా శంకర్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్
మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూసిన భోళా శంకర్ సినిమా ఫైనల్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రిలీజ్ అయి మంచి టాక్ ను తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. చిరంజీవి స్వాగ్, మాస్ యాక్షన్, కామెడీ ఇంకా ఎమోషన్ కంటెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఫ్యాన్స్ అయితే వింటేజ్ చిరు ను మరోసారి చూసినట్టు ఉందని పండగ చేసుకుంటున్నారు. మరోవైపు కలెక్షన్స్ పరంగా కూడా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఫస్ట్ డేనే ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల కలెక్ట్ చేసుకుంది. ఇక చిత్రయూనిట్ కూడా ఈవిషయాన్ని తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలియచేసింది.

భోళాశంకర్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్, కామెడీ, ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈసినిమాను ఖచ్చితంగా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. కేవలం ఒక వర్గానికి మాత్రమే కాదు.. అన్ని వర్గాల వారికి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా ఈసినిమా కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

భోళా శంకర్ కు సూపర్ స్టార్ బెస్ట్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈవయసులో కూడా వరుసగా సినిమాలు చేసుకంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన చిరు ఈఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్.

భోళాశంకర్ నుండి రేజ్ ఆఫ్ భోళా రిలీజ్
వాల్తేరు వీరయ్య తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్.మరో 6రోజుల్లో థియేటర్లలోకి రానుంది.సాంగ్స్,ట్రైలర్ తో సూపర్ హైప్ తెచ్చుకున్న ఈసినిమా మరో 6రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇక ఈసినిమా నుండి తాజాగా రేజ్ ఆఫ్ భోళా అనే సాంగ్ రిలీజ్ అయ్యింది.ఫాస్ట్ బీట్ తో వచ్చిన ఈసాంగ్ ఆకట్టుకుంది.డైరెక్టర్ మెహర్ రమేష్,ఫిరోజ్ ఇజ్రాయెల్ లిరిక్స్ అందించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.

భోళాశంకర్ డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న సుశాంత్
గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే. ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

భోళాశంకర్ నుండి జాం జాం జజ్జనక సాంగ్ రిలీజ్
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

భోళా శంకర్-భోళా మేనియా సాంగ్ ప్రోమో రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భోళా శంకర్. వరుసగా గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకోగా ఈసినిమాతో హ్యాట్రిక్ ఎలాగైనా కొట్టాలన్న ఆశతో మెగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. స్మగ్లింగ్, గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ తో సిస్టర్ సెంటిమెంట్ లో ఈ సినిమా ఉండబోతుంది.

భోళా శంకర్ పాటపై నిర్మాత కాన్ఫిడెన్స్
బ్యాక్ టు బ్యాక్ సినిమాల తరువాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా భోళాశంకర్. వరుస హిట్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను తీస్తోన్న సంగతి తెలిసిందే. అజిత్ వేసిన పాత్రను ఇక్కడ చిరంజీవి చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను ముగించుకుంది.

ఘనంగా మొదలైన నాని 30
అష్టాచమ్మా సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన నాని తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్నాడు. అందుకే పక్కిటి కుర్రాడి ఫేమ్ ను తెచ్చుకున్న నాని సినిమాలు అంటే అందరూ ఇష్టపడతారు. ప్రస్తుతం అయితే నాని వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే దసరా అనే సినిమాలో ఫుల్ మాస్ రోల్ తో అలరించడానికి వచ్చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగిస్తూనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. రీసెంట్ గానే టీజర్ రిలీజ్ చేయగా.. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

పోల్ గేమ్ : 2023 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఏ స్టార్ హీరో మూవీ కి మీ ఓటు ?
అజిత్ తునివు (తెగింపు ):జీ స్టూడియోస్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై సూపర్ హిట్ తీరన్ అధికారం ఒండ్రు మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన నెర్కొండ పార్వై, సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వాలిమై తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ తునివు (తెగింపు )తమిళ మూవీ 2023 జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మంజు వారియర్ కథానాయిక కాగా సముద్రఖని ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా…

అటు విహార యాత్ర - ఇటు వీరయ్య యాత్ర
గాడ్ ఫాదర్ సినిమా బ్లాక్ బస్టర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు మరో మాస్ మూవీతో ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. చిరు హీరోగా బాబి దర్శకత్వంలో వస్తున్నసినిమా వాల్తేరు వీరయ్య. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక మరోవైపు మేకర్స్ అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా ఈసినిమాను సంక్రాంతి బరిలోకి దించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 13వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫిక్స్
బాబి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి బాస్ పార్టీ అనే పాటను రిలీజ్ చేయగా ఆపాటకు సూపర్ రెస్పాన్స్ రావడం చూస్తున్నాం. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై గత కొద్దిరోజులుగా ఎంతో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఇప్పటికే చాలా సినిమా సంక్రాంతి బరిలో దిగనున్నాయి. దానికితోడు వీరసింహారెడ్డి రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. జనవరి 12వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈసినిమా రిలీజ్ డేట్ ఎప్పుడుంటుందో అని ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఈసినిమా సోలో రిలీజ్ డేట్ కూడా ఉండే అవకాశం ఉందన్న…

ఆసక్తికరంగా మారిన వాల్తేరు వీరయ్య రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలను రిలీజ్ చేయగా అందులో గాడ్ ఫాదర్ మాత్రం సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరో మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. బాబి దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి బాస్ పార్టీ అనే పాటను రిలీజ్ చేయగా ఆపాటకు సూపర్ రెస్పాన్స్ రావడం చూస్తున్నాం.

సాంగ్స్ చిత్రీకరణకై ఫ్రాన్స్ దేశానికి వాల్తేరు వీరయ్య
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

రామ్ చరణ్ పై చిరంజీవి ప్రశంసలు
ప్రఖ్యాత నేషనల్ ఛానల్ ఎన్ డి టివి అవార్డుల కార్యక్రమంలో రామ్ చరణ్ కి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు లభించింది. కాగా ఈ కార్యక్రమంలో ఆయనని ట్రూ లెజెండ్ అవార్డుతో వారు సత్కరించారు.ఎన్ డి టివి ట్రూ లెజెండ్ అవార్డుతో సత్కరించడంతో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు.