రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనస్సు చాటుకున్నారు. వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. దీనిలో భాగంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు భారీ విరాళం అందించారు. అయితే గతంలో కూడా ప్రభాస్ తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవడం అందరికీ తెలిసిన విషయమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా గతవారంలో కేరళలోని వయనాడ్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీని కారణంగా పుంజీరిమట్టం, ముండక్కై, చూరల్‌మల, అట్టమల, మెప్పాడి మరియు కున్‌హోమ్ తదితర గ్రామాలలో పలుచోట్ల తెల్లవారుజామున పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా బురద, నీరు మరియు బండరాళ్లు సమీపంలోని దిగువ ప్రాంతాలను ముంచేసాయి.
ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మిలిటరీ సహాయంతో పెద్ద ఎత్తున సహాయక చర్యలను ప్రారంభించింది. ఇక ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం మేరకు, ఈ భారీ వరదల కారణంగా 413 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 273 మందికి పైగా గాయపడ్డారు. ఇంకో 152 మంది ఆచూకీ తెలియరాలేదు. దీంతో ఆయా ప్రాంత వాసులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా ఎంతోమంది ముందుకు వస్తున్నారు.
అయితే ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వయనాడ్ బాధితులకు అండగా విరాళాలు అందజేశారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, మోహన్ లాల్, సూర్య, జ్యోతిక దంపతులు, కార్తి, నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు, సంయుక్త మీనన్ తదితరులు ఉన్నారు. వీరందరూ బాధితులకు చేయూతగా తమ వంతు సాయంగా భారీ విరాళాలను అందించారు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీనితోపాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ సినిమా సీక్వెల్ ‘సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం’ చేయాల్సి ఉంది. అలాగే ఇటీవలే వచ్చిన ‘కల్కి 2898 AD’ మూవీ పార్ట్ 2లో కూడా ఆయన నటించనున్నారు. త్వరలోనే ఈ చిత్రాల చిత్రీకరణ మొదలుకానుంది.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: