మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూసిన భోళా శంకర్ సినిమా ఫైనల్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రిలీజ్ అయి మంచి టాక్ ను తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. చిరంజీవి స్వాగ్, మాస్ యాక్షన్, కామెడీ ఇంకా ఎమోషన్ కంటెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఫ్యాన్స్ అయితే వింటేజ్ చిరు ను మరోసారి చూసినట్టు ఉందని పండగ చేసుకుంటున్నారు. మరోవైపు కలెక్షన్స్ పరంగా కూడా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఫస్ట్ డేనే ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల కలెక్ట్ చేసుకుంది. ఇక చిత్రయూనిట్ కూడా ఈవిషయాన్ని తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#BlockbusterBholaa is off to a Striking Start at the Box Office🔥
3️⃣3️⃣Crores WW Gross on Day 1 for #BholaaShankar💥
IN CINEMAS NOW❤️🔥
Mega🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @AKentsOfficial pic.twitter.com/CjxhgzZrSH
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 12, 2023
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా.. తమన్నా హీరోయిన్ గా ఇంకా రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించగా. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: