గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే. ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇప్పటికే చిరు తన డబ్బింగ్ ను ఇప్పటికే పూర్తి చేసుకున్నాడు. రీసెంట్ గానే ఈసినిమాలో గెస్ట్ పాత్రలో నటిస్తున్న బ్రహ్మీ కూడా తన డబ్బింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు రీసెంట్ గానే ఈసినిమాలో మరో కీలక పాత్రలో సుమంత్ కూడా తన డబ్బింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. భోళాశంకర్ డబ్బింగ్ పూర్తయింది.. వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను.. థ్యాంక్స్ చిరంజీవి గారు అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
Done & done with dubbing! @bholaashankar #cameo
Thank You #MegaStar
@KChiruTweets Sir, @MeherRamesh Sir, @AnilSunkara1 Sir, @KeerthyOfficial @tamannaahspeaks @dudlyraj @SagarMahati @Sekharmasteroff @AKentsOfficial & the entire cast & crew for the wonderful experience!🤗❤️… pic.twitter.com/aN0T19NX7t— Sushanth A (@iamSushanthA) July 19, 2023
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: