
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 72


వంశీలో నన్ను నేను వెతుక్కుంటున్నాను - దిల్ రాజు

ఘనంగా లక్కీ భాస్కర్ విజయోత్సవ సభ

అమరన్ 2 డేస్ కలెక్షన్స్

సింగం ఎగైన్ ఫస్ట్ డే కలెక్షన్స్

అమరన్ టీంను ప్రశంసించిన రజినీకాంత్

పుష్ప 2 నుండి వరుసగా అప్డేట్లు

కంగువా ట్రైలర్ 2 రెడీ

క మొదటి రోజు కంటే ఎక్కువగా

మట్కా ట్రైలర్ రిలీజ్

కుబేర టీజర్ రానుంది

మట్కా ట్రైలర్ రేపే

అమరన్ రికార్డు ఓపెనింగ్స్

క డే 1 కలెక్షన్స్

బావమరిది నిశ్చితార్థం.. ఫ్యామిలీతో హాజరైన ఎన్టీఆర్
టాలీవుడ్ యంగ్ హీరో 'మ్యాడ్' ఫేమ్ నార్నే నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం ఆయన నిశ్చితార్థం శివాని తాళ్లూరితో జరిగింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ ఫ్యామిలీతో సహా హాజరై సందడి చేసారు.

వంశీలో నన్ను నేను వెతుక్కుంటున్నాను - దిల్ రాజు
'మహానటి', 'సీతారామం' తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

అప్పుడు తెలుగు రాదన్నాను, కానీ ఈరోజు ఇలా నిలబెట్టారు
వైవిధ్యభరితమైన చిత్రాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. 'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'.

ఘనంగా లక్కీ భాస్కర్ విజయోత్సవ సభ
వైవిధ్యభరితమైన చిత్రాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. 'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'.

అమరన్ 2 డేస్ కలెక్షన్స్
తమిళ హీరో శివ కార్తికేయన్ అమరన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ వసూళ్లను రాబడుతుంది.మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈసినిమా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది.మొదటి రోజు కంటే కొంచెం అటు ఇటుగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.దాంతో రెండు రోజుల్లో ఈసినిమా 70కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈరోజుతో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.ఇంతకుముందు శివ కార్తికేయన్ డాక్టర్ ఫుల్ రన్ లో 100కోట్ల వసూళ్లను రాబట్టగా అమరన్ కేవలం మూడు రోజుల్లోనే ఆ ఫీట్ సాధించనుంది.

సింగం ఎగైన్ ఫస్ట్ డే కలెక్షన్స్
బాలీవుడ్ మచ్ అవైటెడ్ మూవీ సింగమ్ ఎగైన్ నిన్న రిలీజ్ అయ్యి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు వసూళ్ల వర్షం కురిపించింది. ఈసినిమా ఇండియా లో తొలి రోజు 43.70 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.సింగం సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి దాంతో సింగమ్ ఎగైన్ పై మొదటి నుంచి భారీ అంచనాలు వున్నాయి.వీటికి తోడు రోహిత్ శెట్టి సినిమాలకు నార్త్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.ఈహైప్ కు తోడు సినిమా బాగుందని టాక్ రావడం తో సింగం ఎగైన్ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.రేపటి తో ఈసినిమా ఇండియాలోనే 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

అమరన్ టీంను ప్రశంసించిన రజినీకాంత్
తమిళ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాకు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన రజనీకాంత్.. సినిమాని నిర్మించిన తన మిత్రుడు కమల్‌హాసన్‌కు ఫోన్ చేసి అభినందించారు. అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మెచ్చుకున్నారు. అలాగే శివకార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్ , నిర్మాత ఆర్. మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్ సాయి లని ప్రత్యేకంగా కలిసి అభినందించారు.

పుష్ప 2 నుండి వరుసగా అప్డేట్లు
ఈఏడాది చివర్లో బాక్సాఫీస్ ను షేక్ చేయనుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2.ఈసినిమాపై నేషన్ వైడ్ గా భారీ అంచనాలు వున్నాయి.వచ్చే వారంలో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఓ స్పెషల్ సాంగ్ ను కూడా చిత్రీకరించాల్సి వుంది.ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా చేయని ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది పుష్ప 2. థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ కలిపి 1000కోట్లకు పైనే బిజినెస్ జరిగింది.

కంగువా ట్రైలర్ 2 రెడీ
సౌత్ నుండి ఈ దీపావళికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు సూపర్ రన్ ను కొనసాగిస్తున్నాయి.ఇక వచ్చే వారం నోటెడ్ మూవీస్ రిలీజ్ అవ్వడం లేదు కానీ ఆ నెక్స్ట్ వీక్ మచ్ అవైటెడ్ సూర్య కంగువా రిలీజ్ కానుంది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.ఇక ఈసినిమా నుండి రెండో ట్రైలర్ ను విడుదలచేయనున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా ఇప్పుడు మరో ట్రైలర్ ను వదలనున్నారు.సెకండ్ ట్రైలర్ సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది.1:33 నిమిషాల నిడివి తో రానుంది.

క మొదటి రోజు కంటే ఎక్కువగా
కిరణ్ అబ్బవరం క బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతోంది.మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టి ఎక్స్ లెంట్ గ్రోత్ ను చూపించింది. దాంతో రెండు రోజుల్లో క ప్రపంచ వ్యాప్తంగా 13.11 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ లో సగానికి పైగా టార్గెట్ ను పూర్తి చేసింది. ఈరెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

మట్కా ట్రైలర్ రిలీజ్
మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా ట్రైలర్ వచ్చేసింది.మెగాస్టార్ చిరంజీవి ఈసినిమా ట్రైలర్ ను లంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా వుంది.ఓ కూలీ మట్కా కింగ్ గా ఎలా ఎదిగాడు అనే పాయింట్ తో తెరకెక్కింది ఈసినిమా. యాక్షన్ ,ఎమోషన్స్ సన్నివేశాలను మిక్స్ చేసి ట్రైలర్ ను కట్ చేశారు.ఇందులో వరుణ్ రెట్రో లుక్ ఆకట్టుకుంది. డైలాగ్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్,విజువల్స్ కూడా బాగున్నాయ్ ఓవరాల్ ట్రైలర్ మంచి ఇంపాక్ట్ చూపించేలానే వుంది.

లక్కీ భాస్కర్ సెకండ్ డే సెన్సేషనల్ హోల్డ్
తెలుగు రాష్ట్రాల్లో లక్కీ భాస్కర్ హవా కొనసాగుతుంది.మౌత్ టాక్ సూపర్ గా ఉండడంతో మొదటి రోజు ఎంత రాబట్టిందో రెండో రోజు కూడా ఆ రేంజ్ వసూళ్లను సొంతం చేసుకొని సెన్సేషనల్ హోల్డ్ కొనసాగించింది.రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 26.2కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈరోజు, రేపు కూడా ఇదే ఫ్లో ను కొనసాగించనుంది.దాంతో ఈ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయనుంది.కంగువా వచ్చే వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం తో ఫుల్ రన్ లో ,లక్కీ భాస్కర్ 50కోట్ల మార్క్ ను ఈజీగా క్రాస్ చేయనుంది.

కుబేర టీజర్ రానుంది
సార్ తరువాత ధనుష్ తెలుగులో నటిస్తున్న సినిమా కుబేర.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడు.రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈనెలలో సినిమా కంప్లీట్ కానుంది.ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చింది.ఇక ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఈనెల 15న ఈటీజర్ రానుంది.ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

మట్కా ట్రైలర్ రేపే
మెగా హీరో వరుణ్ తేజ్- పలాస ఫేమ్ కరణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మట్కా.రీసెంట్ గా వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాకు బజ్ క్రియేట్ చేసింది.ఇక కీలమైన ట్రైలర్ ను రేపు రిలీజ్ చేయనున్నారు.రేపు ఉదయం 10గంటలకు పార్క్ హయత్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది. మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదగా ఈ ట్రైలర్ లాంచ్ కానుంది.

అమరన్ రికార్డు ఓపెనింగ్స్
తమిళ హీరో శివ కార్తికేయన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో జవాన్ గా నటించిన సినిమా అమరన్.రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కింది.మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి పాత్రలో సాయి పల్లవి నటించింది.మంచి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.దాంతో రికార్డు స్థాయి లో ఓపెనింగ్స్ ను రాబట్టింది.అన్ని భాషల్లో కలుపుకొని మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 42.3కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని శివ కార్తికేయన్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

ఓటిటిలోకి విశ్వం
ఈ దసరాకు విశ్వం తో వచ్చాడు మాచో స్టార్ గోపిచంద్.చాలా గ్యాప్ తరువాత శ్రీను వైట్ల నుండి వచ్చిన సినిమా ఇది.అయితే ఆశించిన రిజల్ట్ మాత్రం రాలేదు.ఇక ఈసినిమా ఓటిటిలోకిచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ విశ్వంను నేటి నుంచి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా చైతన్య భరద్వాజ్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,చిత్రాలయం బ్యానర్స్ ఈసినిమాను నిర్మించాయి.

లక్కీ భాస్కర్ కు ఫస్ట్ డే సెన్సేషనల్ కలెక్షన్స్
సీతారామం తరువాత మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటించిన రెండో సినిమా లక్కీ భాస్కర్. ట్రైలర్ రిలీజ్ వరకు పెద్దగా బజ్ లేదు కానీ ట్రైలర్ వచ్చాకా పరిస్థితి మారిపోయింది.సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.రిలీజ్ కు ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయడం కూడా అడ్వాంటేజ్ అయ్యింది. నిన్న విడుదలైన ఈసినిమా మొదటి రోజు యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ,టాక్ తో సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకకుంది.ప్రీమియర్లు తో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 12.7కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఒక్క తెలుగులోనే కాదు మలయాళ ,కన్నడ ,తమిళం లో కూడా సూపర్ రివ్యూస్ సొంతం చేసుకోవడంతో సాలిడ్ వసూళ్లను…

క డే 1 కలెక్షన్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క నిన్న విడుదలై సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా పడగా వాటితో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 6.18కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. దాంతో క కిరణ్ కెరీర్ లోనే బిగెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించింది.మౌత్ టాక్ బాగుండడంతో ఈవీకెండ్ లో సూపర్ వసూళ్లను దక్కించుకోనుంది.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది. క్లీన్ హిట్ కావాలంటే 20కోట్ల పైనే రాబట్టాల్సివుంది.కంగువా వచ్చే వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.

వేట్టయన్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
జైలర్ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా వేట్టయన్.గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి డీసెంట్ అనిపించుకుంది.కానీ జైలర్ లో సగం కూడా రాబట్టలేకపోయింది.ఇక ఈసినిమా నెల రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తి కాకముందే ఓటిటి లోకి వస్తుంది.అమెజాన్ ప్రైమ్ వేట్టయన్ ను ఈనెల 8న తమిళం తోపాటు తెలుగు ,మలయాళ ,కన్నడ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ లోకి రానుంది.

వెంకీ అనిల్ 3 టైటిల్ &ఫస్ట్ లుక్ రిలీజ్
విక్టరీ వెంకటేష్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ,టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాన్ స్టాప్ షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా ఈనెల పూర్తి కానుంది.ఇక ఈసినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను కూడా విదులచేశారు.దీనికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది.ఇద్దరు హీరోయిన్ల మధ్య పంచె కట్టులో గన్ పట్టుకొని నిలబడి వున్న వెంకటేష్ స్టిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ గా రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేశారు ఈ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పారు కానీ డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు. అయితే ఇదే బ్యానర్ నుండి…