అప్పుడు తెలుగు రాదన్నాను, కానీ ఈరోజు ఇలా నిలబెట్టారు

Dulquer Salmaan Says, I Feel a Divine Connection with Telugu People

వైవిధ్యభరితమైన చిత్రాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది.

అయితే ఈ సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్న నిర్మాతలు, అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. నిర్మాతల నమ్మకం నిజమై మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది. రోజు రోజుకి వసూళ్లను పెంచుకుంటూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా కథానాయకుడు దుల్కర్ సల్మాన్ చిత్ర విశేషాలు మరియు తన అనుభవాలను పంచుకున్నారు. దుల్కర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. “శ్రీనాథ్ మాగంటి, మాణిక్ రెడ్డి గారు, శివన్నారాయణ గారు, శశిధర్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, మహేష్, రిత్విక్, బెనర్జీ గారు, సాయి కుమార్ గారు అందరితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. సాయి కుమార్ గారి వాయిస్ అనేది ఆయనకు మాత్రమే కాదు, సినీ పరిశ్రమకి బ్లెస్సింగ్.”

“నా చిన్నప్పుడు రాంకీ గారి నటన అంటే ఇష్టం. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడమనేది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. షూటింగ్ లో ఎంతో సహకరించారు. సుమతి పాత్రతో మీనాక్షి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది జి.వి. ప్రకాష్. వెంకీ-జి.వి ఇద్దరూ డైనమిక్ కాంబో. నిర్మాతలకు జి.వి. ప్రకాష్ లాంటి టెక్నీషియన్స్ కావాలి. ఎందుకంటే పాటలు గానీ, నేపథ్య సంగీతం గానీ ఆలస్యం చేయరు.”

“తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. మీతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నాగి, స్వప్న ‘మహానటి’ కోసం నన్ను సంప్రదించినప్పుడు నాకు తెలుగు రాదు అన్నాను. కానీ నన్ను తీసుకొచ్చి, ఈరోజు ఇలా నిలబెట్టారు. ఆ తర్వాత హను గారు ‘సీతారామం’తో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు. ఇప్పుడు వెంకీ. చూడటానికి కుర్రాడిలా ఉంటాడు. కానీ ఎంతో ప్రతిభ ఉంది. అందుకే ఇంత గొప్ప సినిమాలు చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ సినిమా లోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీకి,ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని అన్నారు హీరో దుల్కర్ సల్మాన్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.