సీతారామం తరువాత మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటించిన రెండో సినిమా లక్కీ భాస్కర్. ట్రైలర్ రిలీజ్ వరకు పెద్దగా బజ్ లేదు కానీ ట్రైలర్ వచ్చాకా పరిస్థితి మారిపోయింది.సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.రిలీజ్ కు ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయడం కూడా అడ్వాంటేజ్ అయ్యింది. నిన్న విడుదలైన ఈసినిమా మొదటి రోజు యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ,టాక్ తో సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకకుంది.ప్రీమియర్లు తో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 12.7కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఒక్క తెలుగులోనే కాదు మలయాళ ,కన్నడ ,తమిళం లో కూడా సూపర్ రివ్యూస్ సొంతం చేసుకోవడంతో సాలిడ్ వసూళ్లను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే అమరన్ ,క రూపంలో లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకుంటుంది.సోలో రిలీజ్ అయితే షాకింగ్ కలెక్షన్స్ ను రాబట్టుకునేదే.ఇక ఈ మూడు రోజులు కూడా లక్కీ భాస్కర్ సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 50కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.ఈసినిమాతో దుల్కర్ కు తెలుగులోకూడా వరుసగా రెండు విజయాన్ని నమోదు చేయనున్నాడు.
సార్ ఫేమ్ వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చూన్ ఫోర్ సినిమాస్,శ్రీకరా స్టూడియోస్ నిర్మించాయి.ఇందులో దుల్కర్ నటన,వెంకీ అట్లూరి రైటింగ్ ,డైరెక్షన్,జివి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాలో హైలైట్ అయ్యాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: