‘మహానటి’, ‘సీతారామం’ తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అయితే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది.
దీంతో రోజు రోజుకి వసూళ్లను పెంచుకుంటూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, “ముందుగా నాగవంశీకి శుభాకాంక్షలు. ఒకప్పుడు నన్ను నేను ఇప్పుడు వంశీలో వెతుక్కుంటున్నాను. లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత నాకు దర్శకుడు వెంకీ అట్లూరిపై చాలా గౌరవం పెరిగింది. ప్రేమ కథలతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వెంకీ, సార్ సినిమా నుంచి రూట్ మార్చాడు. ఈ సినిమాలో తను రాసిన డైలాగ్ లకు, క్యారెక్టర్లను హ్యాండిల్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “దుల్కర్ గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తెలుగులో మూడు సినిమాలు.. మూడూ క్లాసిక్స్. జి.వి. ప్రకాష్ మంచి సంగీతం అందించారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా చక్కగా నటించింది. టీం అందరూ కష్టపడి ఒక క్లాసిక్ సినిమాను ఇచ్చారు. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ లో రావడం మరింత సంతోషంగా ఉంది. నేను ఒకప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కూడా చేస్తూ ఘన విజయాలు సాధించాను. ఇప్పుడు వంశీ అది మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే వంశీలో నన్ను నేను వెతుక్కుంటున్నాను అని చెప్పాను” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: