అమరన్ రికార్డు ఓపెనింగ్స్

amaran gets record openings

తమిళ హీరో శివ కార్తికేయన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో జవాన్ గా నటించిన సినిమా అమరన్.రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కింది.మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి పాత్రలో సాయి పల్లవి నటించింది.మంచి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.దాంతో రికార్డు స్థాయి లో ఓపెనింగ్స్ ను రాబట్టింది.అన్ని భాషల్లో కలుపుకొని మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా  42.3కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని శివ కార్తికేయన్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగులో ఈసినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ రిలీజ్ చేయగా మొదటి రోజు 4కోట్ల పైనే గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సగానికిపైగా రాబట్టింది.ఈరోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.ఈరోజుతో టార్గెట్ ను పూర్తి చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈసినిమాతో శ్రేష్ట్ మూవీస్ జాక్ పాట్ కొట్టేసినట్లే.ఫుల్ రన్ లో అమరన్ భారీ లాభాలు అందించనుంది.

ఇంతకుముందు శ్రేష్ట్ మూవీస్ విక్రమ్ ను కూడా ఇక్కడ రిలీజ్ చేయగా ఆ సినిమా భారీ లాభాలను తీసుకొచ్చింది.ఇక ఇప్పుడు అమరన్ అదే ఫ్లో లో వెళుతుంది.సాయి పల్లవి ఉండడం తెలుగులో అమరన్ కు బాగా కలిసొచ్చింది.ఓవరాల్ ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే ఈసినిమా ఫుల్ రన్ లో 200కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడం సాధ్యమయ్యేలా నే వుంది.ఒక్క తమిళనాడు లోనే 100కోట్ల రాబట్టుకునే ఛాన్స్ వుంది.అమరన్ కు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.