వెంకీ అనిల్ 3 టైటిల్ &ఫస్ట్ లుక్ రిలీజ్

Sankranthiki Vasthunam first look out now

విక్టరీ వెంకటేష్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ,టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాన్ స్టాప్ షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా ఈనెల పూర్తి కానుంది.ఇక ఈసినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను కూడా విదులచేశారు.దీనికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది.ఇద్దరు హీరోయిన్ల మధ్య పంచె కట్టులో గన్ పట్టుకొని నిలబడి వున్న వెంకటేష్ స్టిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ గా రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేశారు ఈ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పారు కానీ డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు. అయితే ఇదే బ్యానర్ నుండి మరి భారీ సినిమా గేమ్ ఛేంజర్ కూడా సంక్రాంతికి వస్తుంది.ఆల్రెడీ డేట్ కూడా చెప్పేశారు. జనవరి 10న విడుదలవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు సంక్రాతికి వస్తున్నాం కూడా సంక్రాంతికి ఫిక్స్ చేశారు.మరి ఈసినిమా కు డేట్ ఎలా అడ్జెస్ట్ చేస్తారో చూడాలి.కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

ఇక వెంకీ ,అనిల్ ,దిల్ రాజు కాంబినేషన్ లో ఇంతకుముందు ఎఫ్ 2, ఎఫ్ 3 రాగ ఈ రెండు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. ఈమూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం తో సంక్రాంతికి వచ్చి మూడో హిట్ తో హ్యాట్రిక్ పూర్తి చేయడం ఖాయంగా కనిపిస్తుంది.త్వరలోనే ఈసినిమా నుండి టీజర్ ను విడుదలచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.