బాలీవుడ్ మచ్ అవైటెడ్ మూవీ సింగమ్ ఎగైన్ నిన్న రిలీజ్ అయ్యి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు వసూళ్ల వర్షం కురిపించింది. ఈసినిమా ఇండియా లో తొలి రోజు 43.70 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.సింగం సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి దాంతో సింగమ్ ఎగైన్ పై మొదటి నుంచి భారీ అంచనాలు వున్నాయి.వీటికి తోడు రోహిత్ శెట్టి సినిమాలకు నార్త్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.ఈహైప్ కు తోడు సినిమా బాగుందని టాక్ రావడం తో సింగం ఎగైన్ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.రేపటి తో ఈసినిమా ఇండియాలోనే 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజయ్ దేవగణ్ ,కరీనా కపూర్ జంటగా నటించిన ఈసినిమాలో దీపికా పదుకోన్ ,రణ్వీర్ సింగ్ ,టైగర్ ష్రాఫ్,అక్షయ్ కుమార్ అర్జున్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించారు.ఈసినిమాకు రామాయణం బ్యాక్ డ్రాప్ ను జోడించారు.జియో స్టూడియోస్ ఈసినిమాను నిర్మించింది.యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో హైలైట్ గా నిలిచాయి.
ఇక ఈసినిమా, కార్తిక్ ఆర్యన్ భూల్ భూలయ్య 3 తో క్లాష్ ను ఎదురుకుంటుంది.భూల్ భూలయ్య 3 కూడా నిన్ననే విడుదలయ్యి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. దాంతో మొదటి రోజు 36.60కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.ఈరెండు సినిమాల్లో ఏది సోలో గా వచ్చినా రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకునేదే.మొత్తానికి దీపావళికి వచ్చిన ఈరెండు సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: