కిరణ్ అబ్బవరం క బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతోంది.మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టి ఎక్స్ లెంట్ గ్రోత్ ను చూపించింది. దాంతో రెండు రోజుల్లో క ప్రపంచ వ్యాప్తంగా 13.11 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ లో సగానికి పైగా టార్గెట్ ను పూర్తి చేసింది. ఈరెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో కిరణ్ వరస పరాజయాలకు బ్రేక్ వేసుకున్నాడు.క తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలువనుంది.ఫుల్ రన్ లో క 50 కోట్ల మార్క్ ను చేరుకుంటుందో చూడాలి.సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో క టీం హ్యాపీ గా వుంది. త్వరలోనే క 2 కూడా అనౌన్స్ చేస్తామని కిరణ్ అబ్బవరం అన్నారు.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సుజీత్,సందీప్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఆయ్ ఫేమ్ నయన్ సారిక అలాగే తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించగా సామ్ సీఎస్ సంగీతం అందించాడు.చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈసినిమాను నిర్మించాడు.తెలుగులో ఈసినిమాను వంశీ నందపాటి రిలీజ్ చేశాడు.ట్రెండ్ చూస్తుంటే ఈసినిమాతో బయ్యర్లు మంచి లాభాలను చూడనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























