సార్ తరువాత ధనుష్ తెలుగులో నటిస్తున్న సినిమా కుబేర.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడు.రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈనెలలో సినిమా కంప్లీట్ కానుంది.ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చింది.ఇక ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఈనెల 15న ఈటీజర్ రానుంది.ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శేఖర్ కమ్ముల తన తన రెగ్యులర్ స్టైల్లో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కలర్ ఫుల్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.కుబేర పాన్ ఇండియా మూవీ గా థియేటర్లలోకి రానుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి లో థియేటర్లలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక రీసెంట్ గా రాయన్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు ధనుష్.సార్ తో తెలుగు లో కూడా సాలిడ్ మార్కెట్ ఏర్పరచుకున్నాడు.మరి కుబేర తనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: